సినిమా ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అవ్వడం ప్లాప్ అవడం అన్నది కామన్.కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలవగా కొన్ని దారుణంగా డిజాస్టర్ కూడా అవుతూ ఉంటాయి.
ఇకపోతే ఈ ఏడాది టాలీవుడ్ ( Tollywood )లో ఇప్పటివరకు డిజాస్టర్ల సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.రావణాసుర, ఏజెంట్,రామబాణం, కస్టడీ, స్పై, ఆది పురుష్, రంగబలి,బ్రో, భోళాశంకర్, గాండీవధారి అర్జున ఇలా వరుసగా సినిమాలు విడుదల అయ్యి డిజాస్టర్ లుగా నిలిచాయి.
అయితే ఈ డిజాస్టర్ల సంగతి వేరు.
భోళా శంకర్, గాంఢీవ ధారి( Bhola Shankar, Gandhiva Dhari ) సినిమాల సంగతి వేరు.ముందుగా భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్( Directed by Meher Ramesh ) గురించి చెబితే టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది.ఎందుకంటె కంటే మొహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన కంత్రి, శక్తి,షాడో భోళాశంకర్ లు టాలీవుడ్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి.
ఈ సినిమాలు తీసిన నిర్మాతలు అందరూ నిండా మునిగిపోయి కోలుకోలేని స్థితిలో ఉన్నారు.ఒకవేళ కోలుకున్న చాలా సమయం పడుతుంది.వరుస ప్లాపులు వస్తున్నా ఈ డైరెక్టర్ ను నమ్మి స్టార్ హీరోలతో సినిమా తీసి కోట్లు నష్టపోతున్నా మళ్లీ ఏదో ఒక నిర్మాత ఈ డైరెక్టర్ బుట్టలో పడిపోతున్నారు.షాడో తర్వాత 10 సంవత్సరాల పాటు మెహర్ రమేష్ ను ఇండస్ట్రీ అంతా దూరం పెట్టేసింది.
అయితే బంధుత్వం పేరుతో చిరంజీవి ఆయన్ను దగ్గరకు తీసి తర్వాత అనిల్ సుంకరను( Anil Sunkara ) నిండా ముంచేశారు.అసలు ఈ సినిమాపై ముందు నుంచి ఎవరికీ అంచనాలు లేవు.పదేళ్లపాటు ఇండస్ట్రీకి మెహర్ రమేష్ ను దూరం పెట్టిన వారంతా ఇకపై శాశ్వతంగా దూరం పెడితే మంచిదేమో అనుకోవాలి.ఇక ప్రవీణ్ సత్తార్ విషయానికి వస్తే.ఈయన మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడు.ఎల్బీడబ్ల్యూ రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్,పిఎస్‌వి గరుడ వేగ, గాండీవదారి అర్జున సినిమాలను తెరకెక్కించారు.
ప్రవీణ్ సినిమాల్లో కథా బలమో లేదా కాస్త వైవిధ్యంగా ఉండడమో జరుగుతుంది.అన్నింటికి మించి మెహర్ రమేష్‌లా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించి నిర్మాతలను నిండా ముంచేసే మనిషి అయితే కాదు.