రంగస్థలం మొదట హీరోయిన్ సమంత కాదా... అసలు విషయం చెప్పిన సుకుమార్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈయన దర్శకత్వంలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన సినిమాలను అందించిన సుకుమార్ రామ్ చరణ్ హీరోగా తెరికేకించిన రంగస్థలం సినిమా ఎలాంటి హిట్ అయిందో మనకు తెలిసిందే.ఈ సినిమాలో రాంచరణ్ సమంత ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ లో ఇలాంటి మాస్ యాంగిల్ కూడా ఉందని సుకుమార్ అందరికీ పరిచయం చేశారు.ఇకపోతే తాజాగా సుకుమార్ నిఖిల్ అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన 18 పేజెస్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సినిమా డిసెంబర్ 23వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఘనంగా ఈ వేడుకను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Advertisement
Wasnt Samantha The First Heroine Of Rangasthalam Sukumar Told The Real Story, S

ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ రంగస్థలం సినిమాకు మొదటగా తాము సమంతను కాకుండా అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నామని అయితే ఆడిషన్స్ కి కూడా ఈమె వచ్చారని తెలిపారు.

Wasnt Samantha The First Heroine Of Rangasthalam Sukumar Told The Real Story, S

తనను ఆడిషన్స్ చేస్తున్న సమయంలో అనుపమ భయంతో తన తల్లి వంక చూస్తూ ఉంది.అది గమనించిన తనకు భయం వేసి తనని కాకుండా ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేసినట్లు తాజాగా సుకుమార్ 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుకలు రంగస్థలం సినిమా గురించి చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాకి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు