‘ప్రాజెక్ట్ K’ లో విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ కంటే ముందు ఆ హీరోని సంప్రదించారా..! కానీ ప్రభాస్ ఎందుకు ఒప్పుకోలేదు?

కొన్ని కొన్ని సార్లు మనం కలలో కూడా ఊహించని కాంబినేషన్స్ సెట్ అవుతూ మన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

అలాంటి అద్భుతాలలో ఒకటి గత ఏడాది విడుదలైన #RRR చిత్రం.

నేటి తరం మాస్ హీరోలుగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి ఫోటో దిగితే చాలు అనుకునే ఫ్యాన్స్, ఏకంగా ఒక మల్టీస్టార్ర్ర్ సినిమానే చూసి అభిమానులకు లైఫ్ టైం మెమరబుల్ అనుభూతిని ఇచ్చారు.ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇలాంటి కాంబినేషన్ వస్తుందో లేదో అని అనుకుంటున్న టాలీవుడ్ ఫ్యాన్స్ కి ఏడాది తిరగకుండానే మరో సర్ప్రైజ్ వచ్చింది.

అసలు విషయం లోకి వెళ్తే ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం నాగ అశ్విన్ అనే కొత్త డైరెక్టర్ తో ప్రాజెక్ట్ K అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్ మరియు దీపికా పదుకొనే లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఉన్నారు.

Was That Hero Approached Before Kamal Haasan For The Villain Role In Project K

ఇప్పుడు వీళ్లకు తోడుగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్ కూడా చేరాడు.ఈ చిత్రం లో మెయిన్ విలన్ పాత్ర కోసం ఆయనని సంప్రదించగా, మొదట ఒప్పుకోలేదు కానీ, ఆ తర్వాత నాగ అశ్విన్ న్యారేషన్ స్టైల్ కమల్ కి బాగా నచ్చడం తో వెంటనే ఓకే చెప్పేశాడట.ఇప్పటికీ 80 శాతం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా, కేవలం కమల్ హాసన్ ఉన్న సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

Advertisement
Was That Hero Approached Before Kamal Haasan For The Villain Role In Project K

ఆగస్టు నెల నుండి కమల్ హాసన్ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించాడు.ఇప్పటికే ఈ షూట్ కి సంబంధించి ముంబై లో భారీ ఖర్చు తో టైం ట్రావెల్ సెట్ ని ఏర్పాటు చేసిందట మూవీ టీం.ఈ చిత్రం లో ఆయన కనిపించేది తక్కువ సేపే అయినా థియేటర్స్ నుండి బయటకి వచ్చేటప్పుడు మన మైండ్ లో అలా గుర్తుండిపోయే పాత్ర అట అది.

Was That Hero Approached Before Kamal Haasan For The Villain Role In Project K

నటన కి పర్యాయపదం లాంటి కమల్ హాసన్ లాంటి నటుడు అలాంటి పాత్ర చేస్తే ఇక ఏ రేంజ్ ప్రభావం ఉంటుందో ఊహించుకోవచ్చు.అయితే ఈ పాత్ర కోసం కమల్ హాసన్( Kamal Haasan ) ని కలిసే ముందు, డైరెక్టర్ నాగ అశ్విన్ సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth) తో చేస్తే ఎలా ఉంటుంది అని ప్రభాస్ ని అడిగాడట.ఆయన అభిమాని గా నేను ఒక సినిమాలో నటించాను.

ఆయన పేరు చెప్పుకొని డ్యాన్స్ కూడా వేసాను, అలాంటి స్టార్ ని నా సినిమాలో విలన్ గా తీసుకోవాలంటే చాలా ఇబ్బంది గా ఉంటుంది అని అనడం తో ఆ ఆలోచన విరమించుకొని కమల్ హాసన్ కోసం ట్రై చేశారట.అలా ఈ ప్రాజెక్ట్ లోకి ఊనివెర్సన్ హీరో కమల్ హాసన్ ఎంట్రీ ఇచ్చాడు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మరి అనుకున్న టైం కి వస్తుందో లేదో చూడాలి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?
Advertisement

తాజా వార్తలు