Ranjith Four Govt Jobs : బీటెక్ చదివి నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వరంగల్ కుర్రాడు.. ఈ వ్యక్తి ప్రతిభను మెచ్చుకోవాల్సిందే!

జీవితంలో పైకి ఎదగాలి అంటే కష్టపడాల్సిందే.కష్టపడితే విజయం( Success ) దానంతట అదే వెతుక్కుంటూ మరి కాళ్ళ వద్దకు వస్తుందని చెబుతూ ఉంటారు.

అలా ఇప్పటికే ఎంతోమంది కష్టపడి జీవితంలో పైకి ఎదగడంతోపాటు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే.అందులో ఇప్పుడు మనం తెలుసుకోబోయే యువకుడు కూడా ఒకరు.

బాగా చదువుకుని ఏకంగా ఒకటి రెండు కాదు నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు( Four Govt Jobs ) సాధించాడు.ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు ఆ కుర్రాడు ఎక్కడ ఉంటారు అన్న వివరాల్లోకి వెళితే.

వరంగల్ జిల్లా( Warangal District ) నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామానికి చెందిన రంజిత్‌( Ranjith ) ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపిస్తున్నారు.గ్రామానికి చెందిన వేణుగోపాల్‌ అరుణ దంపతుల పెద్ద కుమారుడు రంజిత్‌.ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదివారు.

Advertisement

ఏడు నెలల క్రితం రైల్వేశాఖలో టెక్నీషియన్‌ ఉద్యోగం, అనంతరం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం సాధించారు.

ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌( Jr.Assistant Job ) ఉద్యోగానికి ఎంపికయ్యారు.తాజాగా శనివారం ప్రకటించిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి పరీక్ష ఫలితాల్లో ఉద్యోగం పొందారు.

రంజిత్‌ ప్రస్తుతం ఎక్సైజ్‌ పోలీసు కానిస్టేబుల్‌ శిక్షణలో ఉన్నారు.టౌన్‌ ప్లానింగ్‌ అధికారి( Town Planning Officer ) ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిపారు.

నాలుగు ఉద్యోగాలు సాధించిన రంజిత్‌ను గ్రామస్థులతో పాటు పలువురు అభినందించారు.ఇతను వరుసగా ఇన్ని విజయాలు సాధించడం పట్ల తల్లిదండ్రులతోపాటు తన స్నేహితులు ఊరికి గ్రామస్తులు బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చూపు లేకపోయినా 4 కిలోమీటర్లు నడిచి గ్రూప్4 జాబ్.. మానస సక్సెస్ కు వావ్ అనాల్సిందే!
Advertisement

తాజా వార్తలు