గ్రేటర్ వరంగల్.. టీ.ఆర్.ఎస్ 18 డివిజన్ల అభ్యర్ధుల జాబితా..!

తెలంగాణా రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందడి మొదలైంది.

ఈ నెల 30న జరుగనున్న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్స్ తో పాటుగా మరో ఐదు మున్సిపాలిటీల ఎన్నికలు జరుగనున్నాయి.

కరోనా తీవ్రత పెరుగుతుండటంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న వాదనకు బదులుగా ఈసీ ఎన్నికలు నిర్వహించడం పక్కా అని తెలుస్తుంది.ఇక అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ రెండు కార్పొరేషన్ల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది.గ్రేటర్ వరంగల్, ఖమ్మం రెండు ఏరియాల్లో డివిజన్లలో బలమైన అభ్యర్ధులను బరీలో దించుతుంది.

వరంగల్ లో 66 డివిజన్లు ఉండగా టీ.ఆర్.ఎస్ తొలి జాబితాగా 18 మంది పేర్లను కన్ ఫాం చేసింది.ఎంపిక చేసిన అభ్యర్ధులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీ ఫారాలను అందించడం జరిగింది.

వరంగల్ కార్పొరేషన్ లో టీ.ఆర్.ఎస్ అభ్యర్ధులుగా 2వ డివిజ‌న్ : బానోతు క‌ల్ప‌న సింగూలాల్, 5వ డివిజ‌న్ : తాడిశెట్టి విద్యాసాగ‌ర్, 7 వేముల శ్రీనివాస్, 13 సురేశ్ జోషి, 15 ఆకుల‌ప‌ల్లి మ‌నోహ‌ర్, 16 సుంక‌రి మ‌నీషా, శివ‌కుమార్, 17 గ‌ద్దె బాబు, 23 యెలుగం లీలావ‌తి స‌త్య‌నారాయ‌ణ, 27 జార‌తి ర‌మేష్, 29 గుండు సుధారాణి, 38 బైర‌బోయిన ఉమా దామోద‌ర్, 45 ఇండ్ల నాగేశ్వ‌ర్ రావు, 51 బోయిన‌ప‌ల్లి రంజిత్ రావు, 55 జ‌క్కుల ర‌జిత వెంక‌టేశ్వ‌ర్లు, 56 సిరంగి సునీల్ కుమార్, 57 న‌ల్ల స్వ‌రూప‌రాణి, 64 ఆవాల రాధిక న‌రోత్తం రెడ్డి, 65 నుండి గుగులోత్ దివ్యారాణి రాజు నాయ‌క్ పోటీ చేస్తున్నారు.

Advertisement
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

తాజా వార్తలు