ఇల్లు కట్టాలని అనుకుంటున్నారా? సిమెంట్ ధరలు తగ్గనున్నాయి, చూసుకోండి!

ఇక్కడ సిమెంట్ ( Cement )లేనిదే పనికాదు.జనాభా పెరిగే కొలదీ ఇక్కడ భవన నిర్మాణాలు జరుగుతూనే ఉంటాయి.

అదొక నిరంతర ప్రక్రియ.భవనమనే కాదు, ఏ నిర్మాణం జరగాలన్నా ప్రధానంగా కావలసింది సిమెంట్.

అందుకే దానికి మార్కెట్లో ఎప్పటికప్పుడు అత్యధిక డిమాండ్ ఉంటుంది.దాంతో వాటి రేట్లు పెరుగుతూ ఉంటాయి.

అలాంటప్పుడు సామాన్యులు ఇల్లు కట్టలేని పరిస్థితి వస్తుంది.

Advertisement

అయితే కేంద్ర ఆర్థిక మంత్రి అధ్యక్షతన, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులతో కూడిన జీఎస్‌టీ కౌన్సిల్( GST Council ) సమావేశం జూన్ రెండో వారంలో కరగనుండగా ఈ సమావేశంలో సిమెంట్‌పై జీఎస్‌టీ రేట్లను 18 శాతానికి తగ్గించే అంశంపై జీఎస్‌టీ కౌన్సిల్ చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రస్తుతం సిమెంట్‌పై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్( Goods and Services Tax on Cement ) 28 శాతంగా ఉండగా అది కాస్త 18 శాతానికి కుదిస్తుండడం చెప్పుకోదగ్గ పరిణామమే అనుకోవాలి.ఇది సామాన్యులపాలిట వరం కానుంది.

ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) కూడా సిమెంట్‌పై జీఎస్‌టీ రేటు తగ్గింపును పరిగణనలోకి తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పిన సంగతి విదితమే.దాంతో జూన్ రెండోవారంలో జరగనున్న 50వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో సిమెంట్‌పై జీఎస్‌టీ అంశంపై చర్చ జరిగే అవకాశం మెండుగా కనబడుతోంది.సొంతిల్లు నిర్మించుకునేవారికి ఇది అతిపెద్ద శుభవార్త కానుంది.

మరి జీఎస్‌టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి మరి.

ఆ నటుడు ఒక్క డైలాగ్ లోని పదానికి పారితోషికం 15 లక్షలట
Advertisement

తాజా వార్తలు