వామ్మో.. ఆ ఒక్క మొబైల్ గేమ్ ఏకంగా 75 వేల కోట్లు రాబట్టిందా..?!

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఇళ్లకే పరిమితం అయ్యారు.ఈ క్రమంలో చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అందరు కూడా ఆన్లైన్ గేమ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

 Wammo That One Mobile Game Alone Earned 75 Thousand Crores , Mobile Games, 75 T-TeluguStop.com

పిల్లలు, యూత్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు.కాస్త ఖాళీ దొరికితే చాలు గేమ్స్ ఆడడం మొదలుపెట్టేస్తున్నారు.

ఇదే అదునుగా చేసుకుని గేమింగ్ యాప్స్ క్రియేట్ చేసినవాళ్లు భారీగా డబ్బులు దండుకుంటున్నారు.ఈ క్రమంలోనే టెన్సెంట్, టీఐఎంఐ స్టూడియోస్ రెండు కలిసి క్రెయేట్ చేసిన ‘హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌‘ అనే మొబైల్‌ గేమ్ గురించి మీకు తెలిసే ఉంటుంది.

ఇప్పుడు ఈ గేమ్ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది.ఇప్పటిదాకా ఈ గేమ్‌ ఆదాయం సుమారు 10 బిలియన్‌ డాలర్లకు పైమాటే అంట.అందుకే అంత పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించిన తొలి మొబైల్‌ గేమ్‌ గా హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ పేరు తెచ్చుకుంది.

అయితే ఈ హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ గేమ్‌ ను చైనా దేశం వారు రూపొందించింది.

చైనా వాళ్ళు ఇలా గేమ్స్ రంగంలో చాలా పేరు గాంచారు అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.అయితే ఈ గేమ్‌ ఒక్క చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.

మిగతా అన్ని దేశాలలో హానర్ అఫ్ కింగ్స్ కి బదులు “ఆరేనా ఆఫ్‌ వాలర్” అనే పేరుతో ఆ గేమ్‌ అందుబాటులో ఉంది.హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ గేమ్‌ చైనాలో బాగా ఫేమస్ అయింది.

ఒకానొక సమయంలో కేవలం ఐఫోన్‌ యూజర్ల నుంచి 717 మిలియన్‌ డాలర్లను ఈ గేమింగ్ సంస్థ కేవలం 3 నెలల్లోనే రాబట్టింది అంటే ఆలోచించుకోండి ఈ గేమ్ ఎంతలా ఫేమస్ అయిందో అని.

Telugu Thousands, Games, Latest-Latest News - Telugu

కాగా ఒక ప్రముఖ నివేదిక ప్రకారం ఈ ఏడాదిలో హానర్‌ ఆఫ్‌ కింగ్స్‌ గేమ్‌ యాప్ ను చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారని, అలాగే ఈ గేమ్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్స్‌ సహాయంతో సుమారు 2 బిలియన్‌ డాలర్లకు పైగా సంపాదించారని వెల్లడించింది.అలాగే ఇప్పటిదాకా బాగా ఫేమస్ అయినా గేమింగ్ యాప్స్ లో అత్యధికంగా పబ్జీ మొబైల్‌, జెన్‌షిన్‌ ఇంపాక్ట్‌, రోబ్లోక్స్‌, త్రీ కింగ్‌డమ్‌ టాక్టిక్స్‌ ముందంజలో నిలిచాయి.ఇప్పుడు అర్ధం అయిందా మనం సరదా కోసం ఆడే గేమింగ్ యాప్స్ ద్వారా వాళ్ళు ఎంత మనీ సంపాదించుకుంటున్నారో అనే విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube