టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత( Samantha ) గత కొద్దిరోజులుగా మయోసైటిసిస్ వ్యాధి( Myositis ) బారిన పడి సినిమాలకు దూరమైన విషయం మనకు తెలిసిందే.ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి తన సినిమా పనులతో బిజీగా మారిపోయారు.
ఇప్పటికే ఈమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రాబోతున్న సిటాడేల్ సిరీస్( Citadel Series ) లో బిజీగా మారిపోయారు.అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న ఖుషి సినిమా షూటింగ్లో ప్రస్తుతం పాల్గొంటున్నారు.

ఈ విధంగా సమంత సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది అయితే వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర బృందం ప్రారంభించారు.ఈ క్రమంలోనే సమంత ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

తాజాగా శాకుంతలం సినిమా గురించి ఈమె మాట్లాడుతూ.ఈ సినిమాకు తన మనసులో ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుందని తెలియచేశారు.ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమా చూసే ఆ క్షణం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నానని ఈ సందర్భంగా సమంత శాకుంతలం సినిమా గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇందులో సమంత శకుంతల పాత్రలో నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు.ఇక ఇందులో భరతుడి పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ద్వారా అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.







