అభిమానం నెత్తిమీదికి ఎక్కితే ఇలానే ఉంటుంది.ఎంత అభిమానం ఉంటే మాత్రం కావాలని నష్టపోవడం ఏంటండి ! గబ్బర్ సింగ్ బ్రాండ్, పవర్ స్టార్ స్టామినా, సెలవులు .
కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి సర్దార్ గబ్బర్ సింగ్ కి.హిట్ అయితే కనకవర్షమే.హీరో పేరు మీద బోలెడన్ని రికార్డులు ఉంటాయి.అయితే బిజినెస్ రికార్డులు హీరో సొంతమవడానికి పంపిణిదారుడు కోట్లు వదిలేసుకోవాలా.
విషయం ఏమిటంటే సర్దార్ గబ్బర్ సింగ్ వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ క్రాంతి రెడ్డి అనే పంపిణిదారుడు కొనుక్కున్నాడు.6.60 కోట్లు (7.40 కోట్లు అని కొందరి వాదన) వెచ్చించి సర్దార్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నాడు.అసలు ఇంతపెట్టడం ఏంటి అని ఆరాతీస్తే, పవన్ కళ్యాణ్ కి రికార్డు రావడం కోసమట.ఇప్పుడు వైజాగ్ ఏరియా వరకు టాక్ బాగా వచ్చిన పెట్టిన డబ్బులు రికవర్ అవడం కష్టమే.
ఈ క్రాంతి రెడ్డి మెగా ఫ్యామిలికి వీరాభిమాని.చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ దాకా, మెగాహీరలంటే ప్రాణం.
తనకి కనీసం ఒకటిరెండు కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, కేవలం పవన్ కళ్యాణ్ కోసం, పవన్ దృష్టిలో పడటం కోసం ఇలా కోట్లు కుమ్మరించాడు.ఏమీటో ఈ విచిత్రం.







