ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన టువంటి ఈ నగరానికి ఏమైంది అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన విశ్వక్ సేన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.
ఆ తర్వాత వచ్చినటి వంటి ఫలక్ నుమా దాస్ చిత్రంతో ప్రేక్షకుల మనసులో తనదైన ముద్ర వేసుకున్నాడు.
అయితే ఇతడు ఫలక్ నుమా దాస్ తర్వాత కథలను ఎంచుకునే ఈ ప్రక్రియలో చాలా శ్రద్ధ వహిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే ఈసారి విభిన్న కథనాన్ని ఎంచుకొని "హిట్" అనే చిత్రంతో మన ముందుకు రానున్నాడు.
తాజాగా ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించి నటువంటి విశ్వక్ సేన్ పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేశారు.కాగా ఈ చిత్రంలో విశ్వక్ సేన్ విక్రమ్ రుద్రరాజు అనే సీరియస్ ఐపీఎస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ చిత్రం చిత్రీకరణ కూడా జరుపుకుంటోంది.
అయితే ఈ చిత్రానికి డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా, నాచురల్ స్టార్ నాని తన సొంత బ్యానర్ అయినటువంటి వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మిస్తున్నారు.అయితే ఈ చిత్రానికి కొన్ని గ్లిమ్ప్స్ ని కొత్త సంవత్సర కానుకగా విడుదల చేయాలనుకుంటున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించుకున్నారు.అయితే ఈ చిత్ర విడుదలకి సంబందించిన విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy