బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లకు దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఆమెకేనా?

బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్( Bigg Boss ) షో ఒకటి.

ఈ షో ప్రారంభమైన అతితక్కువ సమయంలోనే ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే 7 సీజన్లను పూర్తి చేసుకొని ఎనిమిదవ సీజన్ కూడా ఎంతో ఘనంగా ప్రారంభమైంది.సెప్టెంబర్ ఒకటవ తేదీ రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ షోలోకి హోస్ట్ నాగార్జున( Nagarjuna ) కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు బుల్లితెర నటీనటులు సోషల్ మీడియా స్టార్స్ అందరూ కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యష్మీ గౌడ, అభయ్ నవీన్, కన్నడ హీరో నిఖిల్, కృష్ణ ముకుందా మురారి సీరియల్ నటి ప్రేరణ కంభం, ఆదిత్య ఓం,సోనియా, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, శేఖర్‌ బాష, కిరాక్ సీత, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, విష్ణు ప్రియ, నైనిక, నబీల్‌ బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీరందరి రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇలా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన వారితో పాటు బుల్లితెర సెలబ్రిటీలను ఈ సీజన్లో ఎక్కువగా తీసుకున్నారు.ఇక ఈ కార్యక్రమంలో అత్యధికంగా రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్న కంటెస్టెంట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో యాంకర్ విష్ణు ప్రియకు( Vishnu Priya ) అత్యధిక రెమ్యూనరేషన్( Highest Remuneration ) ఇస్తున్నట్టు సమాచారం.

ఈమె ఒక వారం పాటు హౌస్ లో కొనసాగినందుకు ఏకంగా నాలుగు లక్షల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని హౌస్ లో అందరికంటే ఈమెకే ఎక్కువగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు