విశాఖలో గెలిచేది ఎవరైనా ఎదురయ్యే సవాళ్లు ఇవే

ప్రస్తుతం ఏపీలో అతి పెద్ద పట్టణంగా, ఆదాయాన్ని తెచ్చి పెట్టె కల్పతరువుగా విశాఖ మహానగరం ఉంది.

దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల జాబితాలో విశాఖ కూడా ఒకటి.

ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీకి విశాఖ ఆర్ధిక రాజధాని అని చెప్పాలి.అలాంటి విశాఖపై ఇప్పటికే మాఫియా కన్ను పడింది.

విశాఖని మరో ముంబైగా భావిస్తున్న మాఫియా వాళ్ళు ఇప్పటికే అక్కడికి చేరుకొని తమ అడ్డాగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది అనధికార సమాచారం.ఎ విధంగా చూసుకున్న ఇప్పటి వరకు ప్రశాంత నగరంగా ఉన్న విశాఖ ఇకపై అతి పెద్ద సవాళ్ళని ఎదుర్కోబోతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా ఇప్పటికే సిటీలో ఎంటర్ అయిపోయిన రేవ్ పార్టీ సంస్కృతి.అధికార పార్టీలో కొందరు కీలక నేతల అండ దండలతో రేవ్ పార్టీ, డ్రగ్స్ లాంటి విష సంస్కృతి విశాఖలో తిష్ట వేసే ప్రయత్నం చేస్తుంది అని స్వయంగా పోలీసులు చెబుతున్న మాట.మరో వైపు అభివృద్ధిలో పరుగులు తీస్తున్న విశాఖ భూములపై చాలా కన్ను పడింది.స్థలం ఖాళీగా కనిపిస్తే జెండా పాతేసి ఎలాగోలా సొంతం చేసుకోవాలని చూస్తున్న ల్యాండ్ మాఫియా ఇప్పటికే తన పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Advertisement

అధికారంలోకి వచ్చే పార్టీ బట్టి విశాఖని తమ గుత్తాదిపత్యంలోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు.మరో వైపు రౌడీయిజం, సెటిల్ మెంట్స్ చేసే గ్యాంగ్ లు కూడా విశాఖని అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

ఇన్ని విధాలుగా విశాఖపై ముప్పేట దాడి చేసే ప్రయత్నం చేస్తున్న మాఫియాల నుంచి ఈ ఐదేళ్ళు ఎవరు కాపాడుతారు అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా ఉంది అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు