గత మూడు సంవత్సరాల కాలంగా విరాట్ కోహ్లీ(Virat Kohli) రాణించలేకపోతున్నాడు అనే విమర్శలు ఎదుర్కొంటు, మళ్లీ పూర్వ వైభవం అందుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు.ఎట్టకేలకు 2022 ఆసియా కప్, 2022 టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక బోర్డర్ గవాస్కర్(Border Gavaskar) ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్లలో, మొదటి మూడు టెస్టుల్లో చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయినా అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 186 పరుగులు నమోదు చేసి టెస్టు విజయంలో భాగస్వామి అయ్యాడు.అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు, టెస్ట్ కెరీర్ లో 28 సెంచరీలు సాధించాడు.

తాజాగా రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) నిర్వహించిన స్పెషల్ ఇంటర్వ్యూ లో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ప్రతి మ్యాచ్ లో ఆట తీరు ఒకే విధంగా ఉండాలంటే కష్టం.పరిస్థితులను బట్టి ఆటతీరు మారుతూ ఉంటుంది.అద్భుతంగా ఆటలు ప్రదర్శించాలంటే మెంటల్ ప్రిపరేషన్ తో పాటు ఫిజికల్ గా శరీరం దృఢంగా ఉండాలని తెలిపాడు.తాను ఎక్కువగా ఫిట్నెస్ కి ప్రాధాన్యం ఇస్తానంటూ, ఒకే ఓవర్ లో ఆరుసార్లు డబుల్స్ తీయడానికైనా లేదంటే ప్రతి ఓవర్లో వరుసగా సింగిల్స్ కోసం పరిగెత్తడం కోసం సిద్ధంగా ఉండాలని, వీటి కోసం కచ్చితంగా మెంటల్ ప్రిపరేషన్ తో పాటు ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలని తెలిపాడు.

ప్రతి బాల్ బౌండరీ కొట్టాలని రిస్క్ చేస్తే, టీం కూడా రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.కాబట్టి ఎక్కువసేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటానని, మ్యాచ్లో ఆప్ సెంచరీ చేశామా లేదా సెంచరీ చేశామా అనే దానికంటే తన పరుగులు టీం కి ఉపయోగపడ్డాయా లేదా అనేది ఆలోచిస్తానని చెప్పాడు.తనకున్న ప్రత్యేకత గురించి చెబుతూ సింగిల్స్, డబుల్ తీస్తూ రోజంతా క్రీజులో ఉంటూ బ్యాటింగ్ చేయగలనని చెబుతూ, తనకు అవసరమైతే పవర్ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉందని మనసులోని మాట చెప్పాడు.విరాట్ కోహ్లీ మొత్తానికి ఫామ్ లోకి వచ్చాడని క్రికెట్ అభిమానుల్లో సంతోషం నెలకొంది.







