వైరల్: చిరుతపులిని ధీటుగా ఎదుర్కొన్న మగధీరుడు.. వైరల్‌ అవుతున్న ఫుటేజ్!

బేసిగ్గా జంతువులన్నీ అడవుల్లో ఉండటం వలన మనం మనగలుగుతున్నాం గాని, అవే జంతువులు జనావాసాల్లోకి వస్తే ఇక అంతే సంగతి.అయితే అప్పుడప్పుడు దురదృష్టం కొద్దీ, వన్యప్రాణుల దాడులు అడవుల్లోని జంతువులపైనే కాకుండా మనుషులపై కూడా జరుగుతూ ఉంటాయి.

 Viral Who Bravely Faced The Leopard Footage Going Viral , Cheeta , Attack , Viral Latest, Viral News, Social Media, Viral Video-TeluguStop.com

సోషల్ మీడియా విస్తృతి పెరుగుతున్నవేళ ఇలాంటి వీడియోలు వెలుగు చూస్తున్నాయి.ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది.

అది చూసి అందరూ ఆ వ్యక్తిని చూసి శెభాష్ అని మెచ్చుకుంటున్నారు.పర్వత ప్రాంతాలు, దట్టమైన అడవులలో చిరుతలు వేటాడడం తరచుగా మనం చూస్తూనే ఉంటాం.

 Viral Who Bravely Faced The Leopard Footage Going Viral , Cheeta , Attack , Viral Latest, Viral News, Social Media, Viral Video -వైరల్: చిరుతపులిని ధీటుగా ఎదుర్కొన్న మగధీరుడు.. వైరల్‌ అవుతున్న ఫుటేజ్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అప్పుడప్పుడు కొన్ని చిరుతలు ఆహారం కోసం మానవ నివాస ప్రాంతాలకు కూడా వచ్చేస్తున్నాయి.ఆ సమయంలో కనపడిన మనుషులపై దాడులు కూడా చేస్తున్నాయి.సోషల్‌ మీడియాలో అధికంగా వైరల్‌ అయ్యేవి అడవి జంతువులకు సంబంధించినవే.ఇదే విధమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దీనిలో చిరుతపులి నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ఓ వ్యక్తిపై దాడి చేయబోయింది.దీంతో ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా తృటిలో తప్పించుకున్నాడు.

చిరుతపులిని గట్టిగా ఎదుర్కొన్నాడు.ఇంతలో అతనితో పాటు వచ్చిన వారు అతనిపై కర్ర విసిరారు.

ఆ కర్రను అతడు అందుకోవడంతో చిరుత అక్కడి నుంచి పరారైంది.

కాగా ఆ వీడియోని చూసిన జనాలు చిరుతపులిని ఎదిరించిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు అయితే కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు.సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా, కొన్ని వేళల్లో కామెంట్లు పెడుతున్నారు.

మగధీరుడు రామ్ చరణ్ కాదు, నువ్వే అని ఒకరంటే, నీ ధైర్యానికి సలాం, నమస్తే రాఖీభాయ్ అని మరొకరు, అదృష్టం బాగుంది బాబాయ్ అని మరికొందరు, నీకు భూమిమీద నూకలు వున్నాయి అని ఇంకొందరు కొంటెగా కామెంట్లు పెడుతున్నారు.