వైరల్ వీడియో.. వెంటపడి వేధిస్తున్న యువకుడిని కర్రతో చితకబాదిన మహిళ

ప్రస్తుతం దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది.నిత్యం ఏదో ఒక చోట ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మగాళ్ల గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం.

 Viral Video Woman Crushing A Young Man Who Is Harassing Her With A Stick Details-TeluguStop.com

వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇటీవల విజయవాడలో తన వెంట పడి వేధిస్తున్న ఓ పోకిరికి యువతి బుద్ధి చెప్పిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ కుటుంబం మంచిగా బతకాలంటే మహిళలు కూడా ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అందుకే మహిళలు కూడా ఉద్యోగాలు వెళ్లివస్తున్నారు.అయితే రాత్రిపూట ఒంటరిగా ఇంటికి వెళ్లే మహిళలను కొందరు మృగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ పోకిరి బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడు.

దీంతో ఆమె సదరు పోకిరిని కర్ర తీసుకుని చితకబాదింది.

సదరు మహిళ పోకిరికి దేహశుద్ధి చేసే వీడియోను ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

యువతి చూపిన ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ ఆమె కామెంట్ చేశారు.ఇలాంటి మహిళలను చూసి మిగతా ఆడవాళ్లు కూడా ఎంతో ధైర్యం తెచ్చుకుని జీవితంలో ముందుకు సాగిపోవాలి.

సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే చాలా మంది మహిళలు కంగారుపడిపోతారు.వాళ్ల కంగారే మ‌ృగాళ్లకు ఆయుధంగా మారుతోంది.అలా కాకుండా ధైర్యంగా ఎదురొడ్డి నిలబడితే ఎంతటి నీచుడు అయినా భయపడి పారిపోవాల్సిందే.ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోనూ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆలస్యం కావడంతో వేరే వ్యక్తిని లిఫ్ట్ అడిగింది.

దీంతో ఆమెను దుండగులు అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube