వీడియో: మంచి మనసుతో హమ్మింగ్ బర్డ్స్‌ కడుపు నింపిన బాలుడు.. నెటిజన్లు ఫిదా!

సాధారణంగా పిల్లల మనస్సు ఏ కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా ఉంటుందని అంటుంటారు.నిజానికి ఈ విషయం ఎన్నోసార్లు నిరూపితమైంది.

 Viral Video Small Boy Feeding Grains To Hungry Humming Birds Details, Hummingbir-TeluguStop.com

చిన్నపిల్లలు ఎవరినీ మోసం చేయరు, ఎవరికీ హాని తలపెట్టరు.అంతేకాదు, తమ ముందు ఎవరైనా బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేదు.

తమ ఫుడ్ కూడా షేర్ చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఒక బాలుడు కూడా ఆకలితో అలమటిస్తున్న హమ్మింగ్ బర్డ్స్‌ను చూసి చలించిపోయాడు.

అనంతరం తన స్వచ్ఛమైన మనసుతో వాటి కడుపు నింపాడు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజన్లు వావ్, ఈ పిల్లవాడు మనసు బంగారం అని కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.

ఓ బిడ్డోడు తన ఇంటి ముందు ఉన్న ఒక చెక్క గోడపై కూర్చుని ఉండటం చూడవచ్చు.బాలుడి చేతిలో చిన్న ప్లాస్టిక్ గిన్నె ఉండగా అందులో ధాన్యం ఉంది.

ధాన్యం గింజలను పక్షులకు ఆహారంగా అందించేందుకు అతడు బొమ్మ లాగా నిశ్చలంగా కూర్చున్నాడు.ఆ ధాన్యం గింజలను గమనించిన హమ్మింగ్ బర్డ్స్‌ ఎగురుకుంటూ బాలుడి వద్దకు వచ్చాయి.

అనంతరం అవి గింజలను తింటూ కడుపు నింపుకున్నాయి.కొన్ని పక్షులు అతడి చేతిపై కూడా వాలి నిదానంగా ధాన్యాన్ని ఆరగించాయి.

ఈ క్రమంలో అతడు పక్షులు ఎక్కడ బెదిరిపోతాయేమోనని కదలకుండా అలాగే ఉన్నాడు.ఆ బర్డ్స్ తింటుంటే తన కడుపు నిండినంత సంతోషంగా బాలుడు ఫీలయ్యాడు.

హృదయాన్ని హత్తుకునే ఈ దృశ్యాలను తన తల్లి వీడియో తీసింది.

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ బాలుడు మనసు చాలా గొప్పది అని చాలా మంది నెటిజన్లు పొగుడుతున్నారు.

ఇతరులకు సహాయం చేస్తే ఎంత సంతోషం కలుగుతుందో ఈ బాలుడు తెలుసుకున్నాడని అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.మూగజీవులకు ఆహారం అందిస్తే వచ్చే ఆనందమే వేరు, ఈ చిన్న పిల్లోడు తన మంచి హృదయంతో ఈ ఆనందాన్ని ఆస్వాదించాడని, ఇతడు చాలా లక్కీ అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

అయితే హమ్మింగ్ బర్డ్స్ కడుపు నింపిన ఈ పిల్లవాడికి యానిమల్ లవర్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube