వైరల్ వీడియో: స్తంభమెక్కిన ఎలుగు బంటి... కానీ పక్కనే కరెంటు వైరు... ఆడుకున్న కాకులు

ఎలుగు బంటి సర్వభక్షకురాలు. ఎటువంటి ఆహారం అయినా సరే ఇది తింటుంది.

వీటి తెలివికి ఎవరైనా సరే సలాం కొట్టాల్సిందే.ప్రపంచంలో ఉన్న జీవుల్లో ఇవి చాలా తెలివి వంతమైనవి.

కావున ఎలుగు బంట్లు ఎవరికీ చిక్కవు.వీటికి కనుక ఎవరైనా మానవులు చిక్కితే వారిని గాయపరచకుండా వదిలిపెట్టవు.

అప్పుడప్పుడు చంపేస్తాయి కూడా.ఎవరైనా వీటి కోసం వేటాడుతున్నారని, వలలు ఏర్పాటు చేశారని ఇవి ఇట్టే పసిగట్టేస్తాయి.

Advertisement

కావున అటువైపుకు కూడా ఇవి తొంగి చూడవు.పోనే పోవు.

ఇక వేట కోసం వచ్చిన వ్యక్తులు చాలా సేపు నిరీక్షించి ఉత్త చేతులతో వెనక్కు తిరిగిపోతారు.సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇలా ఎక్కువగా వైరల్ అయ్యే జంతువుల వీడియోల్లో ఎలుగుబంట్ల వీడియోలు కూడా కోకొల్లలుగా ఉంటాయి.ఇప్పుడు ఎలుగు బంటికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతోన్న ఈ వీడియోను చూసి చాలా మంది షాక్ అవుతున్నారు.ఏంటి ఎలుగు బంట్లు ఇలా కూడా చేస్తాయా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.నమ్మలేకపోతున్నాం అంటూ రియాక్ట్ అవుతున్నారు.

వింటర్ లో జుట్టు అధికంగా రాలిపోతుందా.. జామ ఆకులతో పరిష్కరించుకోండిలా!

ఒక చోట ఒక ఎలుగు బంటి కరెంట్ పోల్ ను ఎక్కింది.

Advertisement

కరెంట్ పోల్ మీద చివరన కాకి గూడు ఉంది.ఈ గూటిలో ఎలుగు బంటి ఏదో తింటూ కనిపించింది.ఎలుగు బంటి ఈ భూమ్మీద లభించే అన్ని వస్తువులను తింటుంది కావున అది కాకి గుడ్లనో లేక అందులో ఉన్న చిన్న పిల్లలనో తింటుందని ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.

ఇలా ఎలుగు బంటి తన గూడు మీద దాడి చేసిందని తెలుసుకున్న కాకి కూడా ఎలుగుబంటిని తన ముక్కుతో పొడుస్తూ దానికి చుక్కలు చూపెట్టింది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.