వైరల్: ఈసారి రజనీకాంత్ డైలాగ్ తో అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన పోలీసులు..!

భారతదేశంలో వాహనదారులు హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తుంటారు.కొందరు మద్యం తాగి రోడ్ల మీదకు వాహనాలు వేసుకొని దూసుకొస్తుంటారు.

ఐతే ట్రాఫిక్ రూల్స్ ని యదేచ్ఛగా ఉల్లంఘించే వాహనదారులు పోలీసుల జరిమానాలను తప్పించుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయడానికైనా సిద్ధపడుతుంటారు.గతంలో నిబంధనలను తరచూ ఉల్లంఘించే వాహన దారులు ట్రాఫిక్ పోలీసులకు దొరకకుండా చాకచక్యంగా తప్పించుకొని తిరిగేవారు.

కానీ ఫోటో తీసి చలాన్లు జారీ చేసే పద్ధతి వచ్చిన తర్వాత వాహనదారులు తప్పించుకోవడం కష్టమయ్యింది.అయితే కొందరు వాహనదారులు మాత్రం తమ నెంబర్ ప్లేట్ పై బండి నెంబర్ కనిపించకుండా చేస్తున్నారు.

ఒక నెంబర్ ను చేంజ్ చేయడమో లేక నెంబర్ కనిపించకుండా వంచటమో లేదా నెంబరు మార్చటమో చేస్తున్నారు.ఈ విధంగా చాలామంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీస్ ఈ-చలాన్ల నుంచి తప్పించుకుంటున్నారు.

Advertisement
Cyberabad Traffic Police Warn In The Style Of Rajnikanth, Cyberabad Police, Soci

కానీ ఎవరైతే నెంబర్ మార్చారో వారి కారణంగా ఇతర వాహనదారులకు చలాన్లు వెళ్లిపోతున్నాయి.దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

అయితే ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ పోలీసులు నడుంబిగించారు.

Cyberabad Traffic Police Warn In The Style Of Rajnikanth, Cyberabad Police, Soci

తాజాగా సైబరాబాద్ పోలీసులు నెంబర్ ప్లేట్ లేని వాహనదారులను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు."అతిగా ఉల్లంఘనలు చేసే వాహనదారులు, చలానాలు తప్పించుకునేందుకు నెంబర్ ప్లేట్ దాచే వాళ్ళు తప్పించుకున్నట్లు చరిత్రలో లేదు" అని సైబరాబాద్ పోలీసులు రజినీకాంత్ స్టైల్ లో వార్నింగ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంటున్నారు.నిజానికి రజినీకాంత్ నరసింహ సినిమా లో "అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు బాగు పడినట్లు చరిత్రలో లేదు" అని ఒక పవర్ ఫుల్ డైలాగ్ వదులుతారు.

అయితే అదే డైలాగ్ ను సైబరాబాద్ పోలీసులు తమకు అనుగుణంగా మార్చి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చారు.దీంతో వారు ఇచ్చిన వార్నింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు

సినిమా డైలాగులను వాడితే చాలామంది ప్రజలకు తమ హెచ్చరికలు రీచ్ అయ్యే అవకాశం ఉంటుందని సైబరాబాద్ పోలీసులు ఇటువంటి వినూత్నమైన ఆలోచనతో ముందడుగు వేస్తున్నారు.ఏది ఏమైనా తెలివిగా తప్పించుకొనే వాహనదారుల తోక కత్తిరించడానికి పోలీసులు రెడీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు