వైరల్: ఆడీ ఆర్​ 8 కార్ లో స్విగ్గీ ఫుడ్ డెలివరీ..?!

ప్రస్తుత రోజులలో సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది.మనం నిత్యం సోషల్ మీడియాలో ఫ్రాంక్ వీడియోలు, వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం.

తాజాగా ఒక ఆడి కార్ ఓనర్ స్విగ్గి ఫుడ్ డెలివరీకి ఉపయోగించే వీడియో చూసి అందరూ ముందుగా ఆ వీడియో ఫ్రాంక్ అని అనుకున్నారు.కానీ, చివరికి అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

ఆడి కార్ ఓనర్ తానే స్వయంగా ఆర్డర్ లకు యాక్సెప్ట్ చేసి మరి కస్టమర్ల ఇంటి వద్ద ఆహారాన్ని డెలివరీ చేస్తూన్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేయడంతో డబ్బులను సొంతం చేసుకోవడంతో పాటు చాలా ఫేమస్ అయిపోయాడు.

తన కారులో స్విగ్గి ఫుడ్ డెలివరీ కి వాడడం చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురి అయ్యారు.ఈ సందర్భంగా ఆడి కార్ ఓనర్ మాట్లాడుతూ గతంలో హెచ్​2 సూపర్​ బైక్ పై ఫుడ్ డెలివరీ చేసే వాడని, అయితే ఆడి కార్ ను ఫుడ్ డెలివరీ కోసం ఉపయోగించుకోవచ్చు కదా అని పలువురు అడగడం వల్ల ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపాడు.

Advertisement

ఈ సందర్భంగా ఓనర్ మాట్లాడుతూ ఆడి కార్లు ఉపయోగించడం ప్రారంభించిన గంట సమయం తర్వాత మొదటి ఆర్డర్ వచ్చిందని, అనంతరం నేరుగా బేకరీ కి తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినట్లు చెప్పుకొచ్చాడు.కారు అవడంవల్ల బైకుతో పోలిస్తే కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయినట్లు పేర్కొన్నాడు.

ఫుడ్ డెలివరీ చేసే కస్టమర్ అడ్రస్ కు వెళ్లే సమయంలో ఆ ప్రదేశం అంతా ట్రాఫిక్ ఉండడంతో కారును ఒక పక్కకు ఆపుకొని మరి నడుచుకుంటూ వెళ్లి ఫుడ్ డెలివరీ చేసినట్లు తెలిపాడు.అనంతరం ఇంకొక ఆర్డర్ ను ఒకే చేసి కస్టమర్ కు ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియోలు యూట్యూబ్ ద్వారా పోస్ట్ చేశాడు.

అయితే ట్రాఫిక్ సమస్య వల్ల ఫుడ్ డెలివరీ కాస్త ఆలస్యం అయిందని, అలాగే కార్ లో డ్రైవింగ్ సౌకర్యంగా ఉంది అని ఆడీ కార్ ఓనర్ తెలిపాడు.

వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

Advertisement

తాజా వార్తలు