వైరల్: 15 సంవత్సరాలకే 400 పైగా మెడల్స్..!

కొంతమంది చిన్న వయసు నుండే ఎన్నో విషయాలలో ఆరి తెరుతు ప్రపంచం నలుమూలల వారి పేరును వినిపించేలా విజయాలను సొంతం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు.

ప్రపంచం పూర్తిగా తెలియని వయసులోనే 15 సంవత్సరాల ఉన్న మహారాష్ట్రకు చెందిన ఖుషి అనే అమ్మాయి సాధించిన విజయాలు రికార్డులు ఎన్నో.

ఆ అమ్మాయికి తన తల్లిదండ్రుల తోడ్పాడు కారణంగా ఆవిడ ఎన్నో అద్భుతాలు సృష్టించింది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.

ఖుషి తన పంచ్ పవర్ తో పదునైన పంచ్ షాట్ లతో ప్రత్యర్థులను ఎవరైనా సరే అయితే మట్టి కరిపించేది. ఈ అమ్మాయి చిన్నతనంలోనే కరాటే ప్రాక్టీస్ మొదలు పెట్టి అతి తక్కువ సమయంలోనే తన చేతులను రాళ్ళలా మార్చుకొనింది.

కేవలం నాలుగు సంవత్సరాల వయసులోనే ఇంటర్ స్టేట్ చాంపియన్ ను రికార్డు సృష్టించింది.అంతేకాదు ఆ టోర్నీలో సిల్వర్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

ఇక అప్పటి నుంచి మొదలైన తన విజయపరంపర ముందుకు సాగుతూనే ఉంది.

ఖుషి ఇప్పటివరకు తన 15 సంవత్సరాల వయసులోనే నాలుగొందల జాతీయ అంతర్జాతీయ పథకాల ను సొంతం చేసుకుంది.ఈ విజయాలను గురించి ఖుషి మాట్లాడుతూ.తన గెలుపుకి కారణం తన పేరెంట్స్ అంటూ గర్వంగా చెబుతోంది.

వారు నాకు కొండంత ధైర్యం ఇవ్వడం కారణంగానే తాను ఇలాంటి విజయాలను సొంతం చేసుకుంటున్నారు అని చెప్పుకొచ్చింది.ఖుషి ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో బ్లాక్ బెల్ట్ పొందిన యంగెస్ట్ ఛాంపియన్.అలాగే 9 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే రెండో యంగెస్ట్ కరాటే డిగ్రీ పొందిన వ్యక్తిగా రికార్డు సాధించింది.2018 లో కేవలం 13 సంవత్సరాల వయసులో ప్రపంచ యంగెస్ట్ థర్డ్ డిగ్రీ బ్లాక్ బెల్ట్ పొందిన వ్యక్తిగా నిలిచింది.

తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)
Advertisement

తాజా వార్తలు