అమ్మవారి ఫ్లెక్సీ లో ఎమ్మెల్యే రజనీ ? వైరల్ గా మారడం తో 

సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ప్రజా ప్రతినిధుల్లో తన కంటూ ఒక విభిన్న శైలిని అలవర్చుకున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు .

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు, వాటిని సోషల్ మీడియా ద్వారా బాగా ప్రమోట్ చేస్తూ, వైసీపీ అధిష్టానం దగ్గర మంచి గుర్తింపు పొందారు.

త్వరలో జగన్ చేపట్టే మంత్రివర్గ విస్తరణలో రజనీకి కూడా అవకాశం దక్కబొతోది అనే ప్రచారం జరుగుతోంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యే రజిని కొత్త వివాదంలో చిక్కుకున్నారు.

   చిలకలూరిపేట లో జరుగుతున్న పోలేరమ్మ ఉత్సవాల్లో ఎమ్మెల్యే రజిని అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ  దుమారమే రేపుతోంది.దసరా పండుగను పురస్కరించుకుని పోలేరమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రజినిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా అమ్మవారి ఫోటోలతో పాటు, పక్కనే ఎమ్మెల్యే రజిని ఫోటోలను ఏర్పాటు చేయడం వివాదానికి కారణమైంది.

Advertisement
Viral On Mla Vidadhala Rajani Flexy, Mla Rajani, Vidadhala Rajani, Chilakaliripe

దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి పది అవతారాలలోనూ ఫోటోలను ఫ్లెక్సీలలో ఏర్పాటు చేశారు.అమ్మవారి ఫోటోలతో పాటు, ఎమ్మెల్యే రజిని ఫోటోలు పక్కన పెట్టడం వివాదానికి కారణమైంది. 

Viral On Mla Vidadhala Rajani Flexy, Mla Rajani, Vidadhala Rajani, Chilakaliripe

  ఇది సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారడంతో వెంటనే ఆ ఫ్లెక్సీలను ఆలయ నిర్వాహకులు తొలగించారు.అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఎమ్మెల్యే రజిని ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది.

ఈ వ్యవహారంలో ఆమెకు ఏ సంబంధం లేకపోయినా ఆమె ట్రోలింగ్ కి గురవుతున్నారు.అసలు తనకు సంబంధం లేని విషయంలో ఇలా వివాదాస్పదం అవ్వడం పై అటు ఎమ్మెల్యే రజనీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు.

 .

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు