వైరల్: 'చత్పటా డ్యాన్సింగ్ భేల్‌పురి' తిన్నారా? ఆకట్టుకుంటున్న స్ట్రీట్ ఫుడ్!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ మనకి పరిచయం అవుతున్నాయి.ఒక్కోసారి తదితర వీడియోలు ఎక్కువగా వైరల్ కావడం మనం చూస్తూ వున్నాం.

 Viral Have You Eaten 'chatpata Dancing Bhelpuri' Impressive Street Food, Viral ,-TeluguStop.com

సాధారణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అయి ఉంటుంది.అలాంటిది మనం ఇపుడు సోషల్ మీడియా అనే ఒకే వేదికపైన వివిధ రకాల స్ట్రీట్ ఫుడ్( Street food ) గురించి తెలుసుకుంటున్నాం.

ఇకపోతే వ్యాపారాలు అనేవారు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం అమ్మే పదార్ధాల్లో కొత్త కొత్త రుచులను చేరుస్తూ వుంటారు.అమ్మే విధానంలో కూడా ప్రత్యేకతను చాటుకుంటారు.

ఈ క్రమంలోనే ఓ స్ట్రీట్‌లో భేల్‌పురి అమ్మే వ్యక్తి వీడియో ఇపుడు ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.దీని పేరు ‘చత్పటా డ్యాన్సింగ్ భేల్‌పురి’ ( Chatpata Dancing Bhelpuri’ )అంట.ఏంటి, ఆశ్చర్యపోతున్నారా? ఎపుడూ వినలేదు కదా.ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ స్ట్రీట్ ఫుడ్ సోషల్ మీడియా నెటిజన్లను చాలా బాగా ఆకట్టుకుంటోంది.‘భేల్‌పురిని అమ్మడం ద్వారా లక్షాధికారిని అయ్యాను’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ కావడం ఇక్కడ చూడవచ్చు.మరమరాలు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పూరీ, చట్నీ, బంగాళాదుంపలు మసాలాతో సహా భేల్‌పురికి కావాల్సిన పదార్ధాలను ఒక వ్యక్తి గిన్నెలో కలపడం మనం ఇక్కడ చూడవచ్చు.

ఈ క్రమంలో అతను చేతిలో ఓ పెద్ద స్పూన్‌తో డ్యాన్స్ చేస్తూ.కస్టమర్లను అలరిస్తూ భేల్‌పురిని పాత్రలో గిరగిరా తిప్పుతుండడం ఇక్కడ చూడవచ్చు.అతను ఎంతో యాక్టివ్‌గా ఆ ఆహారాన్ని తయారు చేసే విధానం అందర్నీ ఆకట్టుకుంది.ఇందులో దాదాపుగా 60 పదార్ధాలు కలుపుతాడని చెబుతున్నారు.కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో ఇప్పటి వరకు 30 మిలియన్ల వ్యూస్ దాటి దూసుకుపోతోంది.ఈ క్రమంలో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.‘అతని డ్యాన్స్‌తో రుచి మారుతుందా?’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘అతను కాస్త శాంతించాలి’ అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.ఏదిఏమైనా తెలివైన వ్యాపారి.

జనాల్ని తన దుకాణం వైపు తిప్పుకునేందుకు క్రియేటివ్‌గా ముందుకు వెళ్తున్నాడు అని చెప్పుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube