వాట్ ఎన్ ఐడియా సర్జీ.. ఒకే బైక్ పై పది మంది ప్రయాణం..!

పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు తమ ద్విచక్ర వాహనాలను నడపాలని అంటేనే భయపడిపోతున్నారు.

చాలామంది తమ బైకులను ఒక మూలన పెట్టేసి బస్సుల్లో, ఆటో రిక్షాల్లో పనులకు వెళ్తున్నారు.

అయితే ఒక వ్యక్తి మాత్రం పెట్రోల్ ధర సెగను తట్టుకునేందుకు వినూత్న ఆలోచన చేశాడు.అతడి ఆలోచన చూసి నెటిజన్లను తెగ ఫిదా అవుతున్నారు.

వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ మరికొందరు కితాబిస్తున్నారు.మన ఇండియా వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉపాయాలను కనిపెడతారు అంటూ మరికొందరు గర్వంగా ఫీల్ అవుతున్నారు.

ఇంతకీ సదరు వ్యక్తి చేసింది ఏంటో తెలుసుకుంటే.ఇతడు ఒకే బైక్ పై 9 మందిని ఎక్కించుకున్నాడు.

Advertisement

అదెలాగంటే అతడు తన బైక్ కు విమానం రెక్కల్లా ముందు భాగంలో వెనుక భాగంలో చెక్క బలాలను అమర్చాడు.వాటిపై మొత్తం 9 మంది కుటుంబ సభ్యులను కూర్చోబెట్టుకున్నాడు.

అంటే అతడితో కలిసి మొత్తం పదిమంది అన్నమాట.తర్వాత రయ్యి రయ్యి మంటూ రోడ్డుపై దూసుకెళ్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇది చూస్తుంటే ఎవరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.

ఈ చోద్యం చూసిన తోటి వాహనదారులు వెంటనే వీడియో తీశారు.ఆపై దానిని నెట్టింట పోస్ట్ చేయగా అది కాస్త మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జయవర్ధన్ సింగ్ దృష్టికి వచ్చింది.అతను దానిని నెట్టింట షేర్ చేయగా అందరూ వామ్మో ఏంటిది అని ఆశ్చర్యపోతున్నారు.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
జీవితం మహా చెడ్డది భయ్యా.. భార్య వల్ల చెత్త ఏరుకునే స్థాయికి ఇంజనీర్‌..?

"ఇతడు గతజన్మలో ఫైలెట్ అనుకుంటా.అందుకే ఇలా బైక్ ను కూడా విమానంలా మార్చేశాడు" అని కొందరి నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.

Advertisement

అయితే ఒకే బైక్ పై ఇలా పదిమంది ప్రయాణించడం చాలా ప్రమాదకరం.కొంచెం తేడా వచ్చినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.ఒక బైక్ పై ఇద్దరే ప్రయాణించాలని ట్రాఫిక్ నిబంధనలు కూడా చెబుతున్నాయి.

కానీ ఇతడు ఏకంగా తొమ్మిదిమందిని ఎక్కించుకున్నాడు.దీంతో ఇది ట్రాఫిక్ నిబంధనలకు చాలా విరుద్ధమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

వైరల్ వీడియో పై మీరు ఒక లుక్కు వేయండి.

తాజా వార్తలు