చిత్రం : విఐపి 2బ్యానర్ : వండర్ బార్ ఫిలిమ్స్, వి క్రియేషన్స్దర్శకత్వం : సౌందర్య రజనీకాంత్నిర్మాతలు : ధనుష్, కలైపులి ఎస్ థానుసంగీతం : సీన్ అల్డన్విడుదల తేది : ఆగష్టు 25, 2017నటీనటులు : ధనుష్, కాజోల్, అమలా పాల్, రిటూ వర్మ్ తదితరులు
ధనుష్ – అమలాపాల్ జంటగా వచ్చిన రఘువరన్ బీటేక్ (విఐపి) తమిళంలోనే కాదు, తెలుగులో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్లో ఈ సినిమాని తెలుగులోకి రీమేక్ చేసేందుకు కొంతమంది హీరోలు ప్రయత్నించినా, కంటెంట్ మీద నమ్మకంతో డబ్ చేసి హిట్ కొట్టాడు ధనుష్.
అదే ధైర్యంతో దాని సీక్వెల్ విఐపి 2 కూడా అనువాదం చేసాడు.మరి సీక్వెల్ అంచనాలను అందుకుందో లేదో చూడండి
కథలోకి వెళితే :
మొదటిభాగం ఫార్మాట్ లోనే వెళ్ళే కథ ఇది.కాని రఘువరన్ కి కొత్త విలన్ దొరికింది అంతే.రఘువరన్ మంచి ఇంజనీర్ గా పేరు తెచ్చుకున్నాడు.
అతని భార్య శాలిని (అమలాపాల్) ఇల్లు తన పెత్తనంలో చూసుకుంటోంది.సాఫీగా సాగిపోతున్న రఘువరన్ జీవితంలోకి ఓ పెద్ద బిజినెస్ వుమన్ వసుంధర (కాజోల్).
రఘువరన్ తెలివితేటలకు మెచ్చి, తన కింద పని చేయాలని కోరుతుంది వసుంధర.దానికి రఘువరన్ ఒప్పుకోకపోవడంతో వారి మధ్య మొదలైన యుద్ధం పలు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది
నటీనటుల నటన :
ధనుష్ విఐపి మొదటిభాగం మేనరిజమ్స్ ని కొనసాగిస్తూ మంచి నటన కనబరిచాడు.మనకు అల్రెడి పరిచయం ఉన్న క్యారెక్టర్ కావడం వలన, ఆ మెనరిజమ్స్ కొత్తగా అనిపించకపోయినా, ఫస్ట్ పార్ట్ కనెక్ట్ వలన కనువిందు చేస్తాయి.అయితే రఘువరన్ క్యారెక్టర్ లో వినోదం పాళ్ళు తగ్గడం సినిమాకి మంచి విషయం కాదు.
కాజోల్ పాత్ర బాగుంది.మొదట భాగం మాదిరి ఇక్కడ ఉన్నది అమూల్ బేబి కాదు, వసుంధర.
పొగరు, స్టయిల్, కాన్ఫిడెన్స్ కలిగిన పాత్రను అద్భుతంగా పోషించింది కాజోల్.అమలాపాల్ పాత్ర పరిధిమేరలో బాగా చేయగా, రీటు వర్మ తలుక్కున మెరిసింది.
టెక్నికల్ టీమ్ :
మొదటి భాగానికి అనిరుధ్ ఇచ్చిన సంగీతం బాగా ప్లస్ అయ్యింది.కాని తెలియని కారణాలతో అనిరుధ్ ని కొనసాగించలేదు.
సంగీతం ఆకట్టుకోదు.కీలక సన్నివేశాలకి కొత్తగా సంగీతం క్రియేట్ చేయలేదు.
అనిరుధ్ మొదటి భాగానికి ఇచ్చిన స్కోర్ నే వాడేసుకున్నాడు.సినిమాటోగ్రఫీ బాగుంది.
ఎడిటింగ్ ఫస్టాప్, సెకండాఫ్, దేన్ని ఓ పట్టులో నడపలేకపోయింది.నిర్మాణ విలువలు బాగున్నాయి
విశ్లేషణ :
కొన్ని సినిమాలని, కథలని సక్సెస్ తోనే ఆపేస్తే బాగుంటుంది.కేవలం ఆ బ్రాండ్ ని వాడుకోవడానికి, హైప్ తెచ్చుకోవడానికి మ్యాటర్ లేని కథను బలవంతంగా రాసి, ఆ బ్రాండ్ ని చెడగొట్టుకుంటారు.అదే జరిగింది ఇప్పుడు కూడా.
మొదటిభాగం జనాలకు నచ్చడానికి కారణం, ధనుష్ నిరుద్యోగ జీవితం సహజంగా, నిజజీవితానికి దగ్గరగా ఉండటం.దాంతో హ్యూమర్ బాగా పండి అందరు నవ్వుకున్నారు.
తల్లీ – కొడుకుల ఎమోషన్ కి కనెక్ట్ అయిపోయాం.ఈ రెండొవభాగంలో ఆ ఎమోషనల్ టచ్ లేదు.
ఉండటానికి కూడా లేదు.దాంతో కాజోల్ పాత్ర బరువు పెంచేందుకు చేసిన విఫలయత్నాలి సహనాన్ని పరీక్షిస్తాయి.
ఆమె క్యారెక్టర్ లో జరిగే మార్పులు అస్సలు ఎక్కవు.విలన్ క్యారెక్టర్ ఫేయిల్ అయినప్పుడు ఇక హీరోకి ఎలివేషన్ ఎక్కడిది.రఘువరన్ ఎమోషన్స్ ఉన్న సినిమా అయితే విఐపి 2 పైపూతలున్నా, కథలేని సినిమా
ప్లస్ పాయింట్స్ :
* ధనుష్ – కాజల్ నటన* ట్రేడ్ మార్క్ మేనరిజమ్స్
మైనస్ పాయింట్స్ :
* కథ* కాజోల్ పాత్రలో మార్పులు * సంగీతం
చివరగా :
గబ్బర్ సింగ్ కి సర్దార్ గబ్బర్ సింగ్, రఘువరన్ బీటెక్ కి విఐపి 2