దేశ రాజ‌ధానిలో ఉగ్ర క‌ల‌క‌లం.. భారీగా తూటాలు ల‌భ్యం

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా దేశమంతా సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో రాజ‌ధాని ఢిల్లీలో ఉగ్ర క‌ల‌క‌లం చెల‌రేగింది.

ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

అనంత‌రం నిందితుల నుంచి రెండు వేలకు పైగా తూటాల‌ను స్వాధీనం చేసుకున్నారు.పంద్రాగ‌స్టు వేడుక‌ల‌ను పుర‌స్క‌రించుకుని పోలీసులు క‌ట్టు దిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఎక్క‌డా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.న‌గ‌ర వ్యాప్తంగా త‌నిఖీలు నిర్వ‌హించారు.

దీనిలో భాగంగా ఆనంద్ విహార్ ప్రాంతంలో అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.ఆయుధాల స్మ‌గ్లింగ్ కు పాల్ప‌డుతున్న‌ట్లు తేలింది.

Advertisement

ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.ఇటీవ‌ల ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదిని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement