ఆ సమయంలో నోరు మూసుకుంటేనే మంచిది.. విజయ్ కామెంట్స్ వైరల్!

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఈయన ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి నటుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

 Its Better To Shut Your Mouth At That Time Vijay Devarakonda Shocking Comments D-TeluguStop.com

ఇకపోతే తాజాగా ఈయన నటించిన లైగర్ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.

ఇప్పటికే విజయ్ దేవరకొండ నటి అనన్య పాండే పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇదిలా ఉండగా ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.

కెరియర్ మొదట్లో తన గురించి ఎవరైనా ఎలాంటి ప్రశ్నలు వేసిన టక్కున సమాధానం చెప్పేవాడిని.అయితే ఇలా సమాధానాలు చెప్పడం చాలా తప్పు అని తెలుసుకున్నాను.సాధారణంగా మన గురించి కొందరు ప్రశ్నలు వేస్తూ ఉంటారు.అయితే ఆ ప్రశ్నలు వేసేవారు మన గురించి ఓ అభిప్రాయం ఏర్పరచుకొని మనల్ని ప్రశ్నిస్తారు.

Telugu Ananya Pandey, Bollywood, Charmi, Karan Johar, Liger, Puri Jagannath, Tol

ఇలా మన గురించి ముందే వారికి అవగాహన ఉంటుంది కనుక మనం ఎలాంటి సమాధానం చెప్పినా కూడా తప్పుగానే అభిప్రాయపడతారు.అందుకే కొన్ని సందర్భాలలో మాట్లాడటం కన్నా నోరు మూసుకొని ఉండటం ఎంతో మంచిదని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఇప్పటికే లైగర్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ పెద్ద ఎత్తున సినిమా పై అంచనాలు పెంచాయి.

ఈ సినిమా కోసం సౌత్ నుంచి నార్త్ వరకు ఈయన అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube