విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

ఏపీలో 26 జిల్లాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోందని భారతి ప్రవీణ్ పవార్ పేర్కొన్నారు.దాదాపు 35 లక్షల మంది ఈ యాత్రలో భాగస్వామ్యం అయ్యారని తెలిపారు.

అలాగే పేదలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను అందిస్తున్నామని వెల్లడించారు.కాగా అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ పథకాల లబ్ది పొందకుండా మిగిలిపోకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్న విషయం తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు