పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువు వారికి దేవుడితో సమానం అనే విషయం మనకు తెలిసిందే.ఇలా విద్య వ్యవస్థ గురించి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
తాజాగా విద్య వ్యవస్థ గురించి ఎంతో గొప్పగా ప్రేక్షకులకు తెలియజేస్తూ నీతోనే నేను(Neethone Nenu) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఏం సుధాకర్ ఒకప్పుడు టీచర్ గా పని చేసేవారు.
ఈయన టీచర్గా పని చేస్తూ ఇప్పుడు నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తను ఉద్యోగం చేస్తున్న సమయంలో నిజజీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అంజి రామ్ దర్శకత్వంలో వికాస్ వశిష్ట( Vikas Vasistha ) కథానాయకుడిగా కుషిత కళ్ళపు మోక్ష కథానాయకులుగా సందడి చేసినటువంటి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే.
కథ:
రామ్ (వికాస్ వశిష్ట) ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు.అయితే ఈయన టీచర్గా స్కూల్ కి వచ్చామా, పాఠాలు చెప్పామా, వెళ్ళామా అనే విధంగా కాకుండా పిల్లలకు ఏదైనా కొత్తగా నేర్పించాలని ఆరాటపడుతూ ఉంటారు.అయితే ఈయన ఆరాటం చూసి మరి కొంతమంది టీచర్లు ఈర్ష పడతారు.
మరి కొంతమంది మాత్రం ఈయనకు ప్రోత్సాహం కల్పిస్తుంటారు.అలా రామ్‌ను ఇష్టపడుతుంది ఆయేషా (కుషిత కళ్లపు).
( Kushitha Kallapu ) ఆమె అదే స్కూల్‌లో పీటీ టీచర్‌గా పని చేస్తుంటుంది.
క్రమంగా ఆయేషాకు రామ్‌పై ఏర్పడ్డ ఇష్టం ప్రేమగా మారుతుంది.
ఇక ఆయేషా తన ప్రేమ విషయం రామ్ కి చెప్పగా ఆయనకు ఇదివరకే పెళ్లి జరిగిందని తన చిన్ననాటి స్నేహితురాలు సీత (మోక్ష) ను పెళ్లి చేసుకున్నట్టు చెబుతారు.ఈ విషయం తెలిసి ఆయేషా ఒకసారి వారిద్దరిని కలవాలని వారి ఇంటికి వెళుతుంది అయితే అక్కడ ఆమె ఒక విషయం గురించి తెలిసి షాక్ అవుతుంది అసలు ఆయేషా రామ్ ఇంట్లో ఏం చూసింది? అసలు ఆయేషాకు సీతకు మధ్య సంబంధం ఏంటి? అన్నదే ఈ సినిమా కథ.

నటీనటుల నటన:
నటన విషయానికి వస్తే హీరో వికాస్ విశిష్ట ఎంతో అద్భుతంగా నటించారు.ఒక వైపు టీచర్ గా( Teacher ) పిల్లలను అభివృద్ధిలోకి తీసుకురావాలని మరోవైపు భార్య కోసం తపన పడే భర్తగా తన నటన వరకు ఎంతో అద్భుతంగా నటించారు.కుషిత లుక్ పరంగా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది మోక్ష ఎమోషనల్ అద్భుతంగా నటించి అందరిని ఆకట్టుకున్నారు.ఇక ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు అనుగుణంగా న్యాయం చేశారు.

టెక్నికల్:
విద్య వ్యవస్థ పై( Education System ) ఎంతో అద్భుతమైన కథతో డైరెక్టర్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.మంచి మెసేజ్ తో పాటు మరోవైపు మంచి లవ్ స్టోరీని( Love Story ) కూడా ప్రేక్షకులకు పరిచయం చేశారు.మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి.సినిమాటోగ్రాఫర్ విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.నిర్మాణాత్మక విలువలు కూడా పర్వాలేదు అనిపించింది.

విశ్లేషణ:
ప్రవేట్ పాఠశాలలలో చదివే పిల్లలకు అన్ని వసతులు ఉంటాయి కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు సరైన వసతులు లేవు వారికి కూడా ఇలాంటి వసతులు కల్పిస్తే వాళ్లు కూడా అద్భుతాలు సృష్టించగలరు అన్న కథతో డైరెక్టర్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.విద్యా వ్యవస్థ పై ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది.
ప్లస్ పాయింట్స్:
ఇంటర్వెల్ ముందు హీరో హీరోయిన్ మధ్య ఇచ్చే ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంది.సెకండ్ హాఫ్ ఎంతో ఆసక్తికరంగా మారింది.మ్యూజిక్ ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ కథ సాగదీసారు.మధ్యలో కమర్షియల్ సాంగ్ పెట్టడం కూడా కాస్త నెగిటివ్ అనిపించింది.
బాటమ్ లైన్:
విద్యా వ్యవస్థ గురించి ఎంతో అద్భుతంగా చూపిస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు.అయితే ఈ సినిమా బోర్ కొట్టకుండా ఒకటికి రెండుసార్లు చూడవచ్చు.







