బన్నీని విజయసాయిరెడ్డి కాకా పడుతున్నారా.. అసలేం జరిగిందంటే?

గతేడాది విడుదలైన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గాని నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో బన్నీ పర్ఫామెన్స్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి.

బన్నీకి జోడీగా ఈ సినిమాలో రష్మిక నటించగా సుకుమార్ డైరెక్షన్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండటంతో ఈ సినిమా పాన్ ఇండియా హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.తాజాగా సైమా అవార్డ్స్ లో కూడా పుష్ప ది రైజ్ హవా కొనసాగింది.

ఈ సినిమాకు ఏకంగా 6 అవార్డులు వచ్చాయి.మరే సినిమా సాధించని స్థాయిలో ఈ సినిమా అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.

అయితే ఈ సినిమాను మెచ్చుకుంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా బన్నీని కాకా పట్టడానికే ఆయన ఈ విధంగా ట్వీట్ చేశారని చాలామంది కామెంట్లు చేశారు.పుష్ప చిత్రం యూనిట్ కు అభినందనలు అని ఈ సినిమాలో బన్నీ నటన, సుకుమార్ డైరెక్షన్ అద్భుతం అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

బన్నీ, సుకుమార్ ఈ సినిమాతో తగ్గేదేలే అని ప్రూవ్ చేశారని విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు.విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు 47కు పైగా లైక్స్ వచ్చాయి.

అయితే సైమా అవార్డులను గెలుచుకున్న ఇతర సినిమాలను కూడా ఆయన అభినందించి ఉంటే బాగుండేదని మరి కొందరు కామెంట్లు చేశారు.బన్నీ నుంచి ఏదో ఆశించి విజయసాయిరెడ్డి ఈ తరహా కామెంట్లు చేశారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది మాత్రం విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయనపై సెటైర్లు వేయడం గమనార్హం.ప్రస్తుతం బన్నీ ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదు.గతంలో ప్రజారాజ్యం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన బన్నీ ప్రస్తుతం రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు.

మరోవైపు బీజేపీకి అనుకూలంగా ట్వీట్లు చేయడానికి ఆయన ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich
Advertisement