స్వర్ణ ప్యాలెస్ కేసు: ఎఫ్ ఐ ఆర్ పై స్టే!

ఏపీ లోని విజయవాడ లో స్వర్ణ ప్యాలెస్ కేసు ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ కేసులో దాఖలైన ఎఫ్ ఐ ఆర్ పై ఏపీ హైకోర్టు తాజాగా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలి అంటూ కోర్టు స్పష్టం చేసింది. డాక్టర్.

AP High Court Gives Stay On Swarna Palace Fire Accident Case FIR, Vijayawada, Sw

రమేష్ కుమార్ ఈ కేసుకు సంబంధించి క్వాష్ పిటీషన్ ను కోర్టులో దాఖలు చేయగా,ఈ రోజు విచారణ చేపట్టిన కోర్టు పై మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తుంది.డాక్టర్.

రమేష్ కుమార్ తో పాటు చైర్మన్ పై కూడా తదుపరి చర్యలు తీసుకోకుండా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.అలానే స్వర్ణ ప్యాలెస్ ను క్వారంటైన్ సెంటర్ కు అనుమతి ఇచ్చిన కలెక్టర్,సబ్ కలెక్టర్,డీఎంహెచ్ వో లను ఎందుకు భాద్యులను చేయలేదు అంటూ కోర్టు ప్రశ్నించింది.

Advertisement

ఏళ్ల తరబడి స్వర్ణ ప్యాలెస్ నిర్వహిస్తుండగా గతంలో ఎప్పుడూ కూడా ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదని, అసలు క్వారంటైన్ సెంటర్ కు అనుమతి ఇచ్చినప్పుడు అయినా కూడా అక్కడ పరిస్థితులను ఎందుకు అధికారులు పరిగణలోనికి తీసుకోలేదు అని కోర్టు ప్రశ్నించింది.అయితే ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది కాబట్టి వారిని కూడా నిందితులుగా చేరుస్తారా అంటూ కోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

విజయవాడ లోని స్వర్ణ ప్యాలెస్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకొని 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి డాక్టర్.

రమేష్ హాస్పటల్ యాజమాన్యం సరైన ప్రమాణాలు పాటించకుండా అక్కడ క్వారంటైన్ సెంటర్ ను నిర్వహిస్తుంది అంటూ విచారణ కమిటీ కూడా ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసుకు సంబంధించి డాక్టర్ రమేష్ కుమార్ క్వాష్ పిటీషన్ దాఖలు చేయడం తో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు