2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఆర్ఆర్ఆర్ మూవీ ఒకటనే సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో సక్సెస్ అయిందని చాలామంది భావిస్తారు.
చరణ్, తారక్ తమ పాత్రలలో అద్భుతంగా ఆర్ఆర్ఆర్ మూవీ రేంజ్ మరింత పెరగడానికి ఎంతగానో కష్టపడ్డారు.ఆర్ఆర్ఆర్ మూవీ కొన్ని నెలల క్రితమే ప్రముఖ ఓటీటీలలో అందుబాటులోకి వచ్చింది.
ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లోమ్ స్ట్రీమింగ్ అవుతుండగా ఆర్ఆర్ఆర్ తెలుగు వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు జీ5 యాప్ లలో స్ట్రీమింగ్ అవుతోంది.ఆర్ఆర్ఆర్ తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లు కూడా జీ5, హాట్ స్టార్ లలో అందుబాటులో ఉన్నాయి.
అయితే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన ఆరు నెలల తర్వాత విజయసాయిరెడ్డి ఈ సినిమా గురించి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హాలీవుడ్ ఆడియన్స్ ను సైతం ఆర్ఆర్ఆర్ మూవీ ఆకట్టుకుందని విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు.
హాలీవుడ్ మ్యాగజైన్ అయిన వెరైటీ మ్యాగజైన్ ఆస్కార్ బరిలో తారక్, చరణ్ ఉండొచ్చని చెబుతుండటం మన తెలుగు సినిమా స్థాయిని చాటి చెబుతున్నాయని విజయసాయిరెడ్డి కామెంట్లు చేశారు.ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తుందని భావిస్తున్నానని ఆయన ఆయన తెలిపారు.

ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ లో నిర్మాతలకు భారీ మొత్తంలో లాభాలను అందించింది.ఆర్ఆర్ఆర్ సినిమా హీరోలకు అవార్డ్ వస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.ఇతర పార్టీల కీలక నేతలు సైతం ఆర్ఆర్ఆర్ మూవీకి అవార్డ్ రావాలని కోరుకుంటూ ఉండటం గమనార్హం.ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో దర్శకుడు రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
హీరోలకు, దర్శకునికి ఆస్కార్ రావాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు.విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.