నెల్లూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.గడప గడపకు తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బారు నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
నెల్లూరు నగర ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు.సంక్షేమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు సాగుతుందో అభివృద్ధిలో మరొక అడుగు ముందుకేస్తామన్నారు.
అసెంబ్లీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ కు ఎంపీ అభ్యర్థిగా తనకు ఫ్యాను గుర్తుపై ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.