పరిపాలన రాజధానిగా విశాఖ... కన్ఫర్మ్ చేసిన విజయసాయి రెడ్డి

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ముఖ్యమంత్రి జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అనే విషయాన్ని చూచాయగా చెప్పి ఏపీలో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజేశారు.

ఇక తరువాత జి ఎన్ రావు కమిటీ నివేదికలో కూడా రాజధానులు మూడు ఉండాలని, పరిపాలనా రాజధానిగా విశాఖ సరైంది అని పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో గత కొద్ది రోజులుగా విశాఖ పరిపాలన రాజధానిగా ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని, ఇక దానికి సంబందించిన కార్యాచరణ, ప్రభుత్వ కార్యాలయాలకి బిల్డింగ్స్, అలాగే నిర్మాణాలకి స్థల సమీకరణ కూడా జరుగుతుంది.ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనని ప్రభుత్వం ఎంత మాత్రం మట్టించుకునేలా కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ విశాఖ పరిపాలన రాజధానిగా చేయాలనే నిర్ణయం ఫైనల్ అయినట్లు స్పష్టం చేసేశారు.దీని మీద 27న జరిగే క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిపారు.

విశాఖని పరిపాలనా రాజధానిగా ప్రకటించనున్న తర్వాత మొదటి సారిగా విశాఖ ఉత్సవ్ లో పాల్గొనడానికి జగన్ నగరానికి రానున్నారని, అతనికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.క్యాబినెట్ నిర్ణయం కాకముందే విజయసాయి రెడ్డి విశాఖని పరిపాలన రాజధానిగా చేసినట్లు నిర్దారించడంపై ఇప్పుడు ఉత్తరాంద్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే అమరావతి ప్రాంతంలో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.

Advertisement

మరి దీనిపై విపక్షాలు, రాజధాని రైతులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.

ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

Advertisement

తాజా వార్తలు