తెలుగులో ఫిలిమ్ పేరుతో ఓటీటీ... పిజ్జా2 ఫస్ట్ రిలీజ్

లాక్ డౌన్ తర్వాత డిజిటల్ ఎంటర్టైన్మెంట్ తన ప్రభావం చూపించడం మొదలు పెట్టింది.

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ తో థియేటర్లు బంద్ కావడంతో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపించడం మొదలు పెట్టారు.

దీంతో చాలా మంది డిజిటల్స్ ఛానల్స్ అయినా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పెట్టడానికి ముందుకొస్తున్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ లాంటి ఓటీటీ ఛానల్స్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి.

Vijay Setupati Pizza 2 Releasing In Ott, Tollywood, Telugu Cinema, Digital Ente

వీటిలో వెబ్ సిరీస్, సినిమాలు అన్ని భాషలకి సంబంధించి ఉంటాయి.అయితే కేవలం సౌత్ ఇండియన్ సినిమాలు, తెలుగు సినిమాల కోసమే కొంత మంది ఇప్పుడు ఓటీటీ ఛానల్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ఛానల్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు.ఈ యాప్ ద్వారా వెబ్ సిరీస్ లు తెరకెక్కించడంతో పాటు, సినిమాలు కూడా రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

మరో వైపు సురేష్ బాబు ఓటీటీ ఛానల్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు.అలాగే ఈనాడు యాజమాన్యం కూడా ఓటీటీ బిజినెస్ లోకి అడుగుపెడుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ అందుబాటులోకి వచ్చింది.ఫిలిమ్ పేరుతో ఓ ఓటీటీ ఛానల్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ ఓటీటీ ద్వారా విజయ్ సేతుపతి పిజ్జా 2 సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.లాక్ డౌన్ కి ముందు రిలీజ్ అయినా ఈ సినిమా రిజల్ట్ పూర్తిస్థాయిలో రాకుండానే థియేటర్లు మూతపడ్డాయి.

దీంతో నిర్మాతలు ఇప్పుడు ఓటీటీలోకి వచ్చి ఫిలిమ్ ఓటీటీ ఛానల్ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.విజయదశమికి పిజ్జా 2 సినిమాతో పాటే ఈ ఫిలిమ్ ఓటీటీ మార్కెట్ లోకి పూర్తి స్థాయిలో రానున్నట్లు తెలుస్తుంది.

13 ఏళ్లకే పెళ్లి మాటెత్తిన డబ్బింగ్ జానకి.. ఆమె లవ్ స్టోరీతో సినిమా తీయొచ్చు..?

మరి ఆహా రేంజ్ లో ఈ ఛానల్ కూడా తెలుగు, సౌత్ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందో లేదో అనేది వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు