రామ్ చరణ్ సినిమాకు అందుకే నో చెప్పా.. విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

తెలుగు ప్రేక్షకులకు నటుడు విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

విజయ్ సేతుపతి తమిళ నటుడు అయినప్పటికీ ఉప్పెన సినిమాతో భారీగా క్రేజ్ ను ఏర్పరచుకోవడంతోపాటు తెలుగులో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

ఈ సినిమా విడుదల అయ్యి భారీ సక్సెస్ కావడంతో విజయ సేతుపతికి తెలుగులో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.అటు తమిళంలో కూడా అవకాశాలు భారీగా వచ్చాయి.

అయితే ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబు( Buchi Babu ) విజయ్ సేతుపతి కి మరో అవకాశం ఇచ్చారంటూ కొద్దిగా వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటిస్తున్న ఆర్సి 16లో( RC16 ) విజయ్ సేతుపతి కీ రోల్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి.ఇదే విషయం గురించి ఒక రిపోర్టర్ తాజాగా ఒక ప్రెస్ మీట్ లో ప్రశ్నించగా విజయ్ సేతుపతి తాను చరణ్ సినిమాలో నటించడం లేదంటూ స్పష్టం చేశారు.ఇప్పుడు ఆ సినిమాలో నటించే సమయం లేదని వివరించారు.

Advertisement

డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తారా? అని అడగగా చాలా కథలు వింటున్నానని, ఏదైనా స్టోరీ బాగుంటే అందులోని హీరో క్యారెక్టర్‌ నచ్చడం లేదని అన్నారు.

త్వరలోనే ఒక సినిమా సెట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు విజయ్ సేతుపతి.తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పటికీ మరువలేనని ఆయన అన్నారు.ఈ సందర్భంగా విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

విజయ్ సేతుపతి నేరుగా తెలుగు సినిమాల్లో హీరోగా నటిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.మరి ఏ దర్శకుడి దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా సినిమా చేస్తారో చూడాలి మరి.ప్రస్తుతం అటు తెలుగు ఇటు తమిళం సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు విజయ్ సేతుపతి.

సందీప్ వంగ డైరెక్షన్ లో నటించలేనని చెప్పిన స్టార్ హీరోయిన్...
Advertisement

తాజా వార్తలు