ఆ వ్యక్తి కోసమే నేను ఉప్పెన మూవీలో నటించా.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్ !

వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ( Vaishnav Tej, Kriti Shetty )హీరో హీరోయిన్లుగా కలిసి నటించిన చిత్రం ఉప్పెన.

ఇందులో విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాతోనే కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు.ఈ సినిమాతో భారీగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇకపోతే విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) తాజాగా నటించిన చిత్రం మహారాజా.క్రైమ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని నిథిలన్‌ దర్శకత్వంతో తెరకెక్కించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది.ప్రస్తుతం ఆయన మహారాజా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.

Advertisement

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఆయన ఉప్పెన చిత్రంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.

ఉప్పెన సినిమా( Uppena movie ) కేవలం నేను బుచ్చిబాబు కోసమే చేసాను.

ఆయనకున్న ప్యాషన్‌ చూసి నేను ఒప్పుకున్నాను.చాలా తక్కువ రెమ్యునరేషన్‌కే ఉప్పెన సినిమా చేశాను.మామూలుగా ‍అయితే నాలాంటి యాక్టర్స్‌ చేయడానికి వెనుకాడతారు.

కానీ సినిమా పట్ల బుచ్చి బాబు( Buchi Babu )కున్న ప్యాషన్ చూసే ఆ చిత్రంలో నటించాను అని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి.ఈ సందర్భంగా విజయ సేతుపతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

కాగా ఈ సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ సేతుపతి అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు