కత్రినా కైఫ్ తో దేవరకొండ... బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలో స్టార్ హీరో ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ.

అభిమానులు అందరూ అతనికి ముద్దుగా రౌడీ స్టార్ అనే కొత్త బిరుదు కూడా ఇప్పటికే ఇచ్చేశారు.

ఇక రౌడీ విజయ్ తన వే స్టైల్, యాటిట్యూడ్ తో యూత్ లో ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.అలాగే అమ్మాయిలకి కూడా డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు.

Vijay Deverakonda To Romance Katrina Kaif, Tollywood, Liger Movier, Karan Johar,

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దేవరకొండ బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే బాలీవుడ్ భామలకి కూడా హీరో క్రష్ అయిపోయాడు.ముంబైలో బిటౌన్ బ్యూటీస్ తో చెట్టాపట్టాల్ వేసుకొని పార్టీలలో తిరిగేస్తూ వారితో కలిసిపోయాడు.

Advertisement

అలాగే అక్కడి దర్శక, నిర్మాతలని కూడా భాగానే ఆకట్టుకుంటున్నాడు.లైగర్ సినిమాకి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాత కావడంతో విజయ్ దేవరకొండతో డైరెక్ట్ హిందీమూవీ చేయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు.

లైగర్ అయిపోయిన తర్వాత టైమ్ చూసుకొని బాలీవుడ్ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయాలని భావించారు.అయితే లైగర్ షూటింగ్ కి కరోనా రూపంలో అవాంతరాలు వస్తూ ఉండటంతో ఇప్పుడు సెకండ్ హిందీ సినిమా గురించి సమాచారం బయటకి వచ్చేసింది.

కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తో రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్ బలంగా వినిపిస్తుంది.

రీసెంట్ గా కత్రినా కైఫ్ విజయ్ దేవరకొండని ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం స్టార్ట్ చేసింది.దీంతో ఈ టాక్ కి మరింత బలం దొరికినట్లు అయ్యింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

ఈ చిత్రంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అధికారికంగా వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు