ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రౌడీ హీరో... వంద మందిని ట్రిప్ కోసం ఎక్కడికి పంపించనున్నారో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విజయ్ దేవరకొండ ఒకరు.

ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు.

ఇక గత ఏడాది లైగర్ అనే సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.

ఇకపోతే గత ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ దేవర శాంటా పేరుతో ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేశారు.ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా అభిమానులకు కానుకలు ఇస్తుంటారు.

ఇక ఈ ఏడాది అభిమానులకు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్ ఇచ్చారు.వందమంది అభిమానులను ఈయన హాలిడే వెకేషన్ పంపించబోతున్నట్లు తెలియజేశారు.

Advertisement

అయితే అభిమానులను హాలిడే వెకేషన్ కోసం ఎక్కడికి పంపించాలనే విషయంలో తనకు హెల్ప్ చేయమని కోరారు.ఈ హాలిడే వెకేషన్ కి సంబంధించిన ఖర్చులను కూడా తానే భరిస్తానని విజయ్ వెల్లడించారు.

తాజాగా ఈ ట్రిప్ గురించి మరోసారి అప్ డేట్ ఇచ్చారు.

ఇక ఈ ఏడాది తాను 100 మంది అభిమానులను మనాలి పంపించబోతున్నట్టు తెలిపారు.నేను మీలో 100 మందిని మనాలికి 5 రోజుల ట్రిప్ కు పంపుతున్నాను.మీరు మంచుతో కూడిన పర్వతాలను చూడబోతున్నారు.మీకోసం అన్ని ప్లాన్ చేశాను.18 సంవత్సరాలు పై బడి ఉన్నవారు ఫారం కంప్లీట్ చేసి నన్ను ఫాలో అవ్వండి.మీలో 100 మందిని ఎంపిక చేసాము.

మీలో నేను బాగమవుతా అంటూ విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక 100 మందిని మనాలి మౌంటెన్స్ పంపించనున్నట్లు తెలుస్తోంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement