ప్రిన్స్ ఈవెంట్ లో నోరువిప్పిన విజయ్.. అందుకు బాధగా అనిపించిందంటూ..

తమిళ్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.ఎందుకంటే ఇటీవల కాలంలో వరుస హిట్స్ అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యాడు.

శివకార్తికేయన్ సినిమాలన్నీ తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.దీంతో ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక ఇప్పుడు శివకార్తికేయన్ డైరెక్ట్ తెలుగు సినిమాతో రాబోతున్నాడు.జాతిరత్నాలు సినిమాతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కె వి.ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ్ హీరో శివకార్తికేయన్ తో బైలింగ్వన్ సినిమా చేస్తున్నాడు.వీరిద్దరి కాంబోలో ప్రిన్స్ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా నుండి ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది.ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి గ్రాండ్ గా జరిగింది.ఈ ఈవెంట్ చీఫ్ గెస్టుగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విచ్చేశాడు.

విజయ్ లైగర్ సినిమా ప్లాప్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు వచ్చాడు.దీంతో ఈయన స్పీచ్ పై ఆసక్తి నెలకొంది.

ఇక ఈ ఈవెంట్ లో ఈయన మాట్లాడుతూ.శివ కార్తికేయన్ జర్నీ అంటే తనకు చాలా ఇష్టం అని.చిన్న నటుడిగా మొదలుపెట్టిన ఈయన కెరీర్ ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మంచి గుర్తింపు ఉన్న హీరోగా ఎదగడం ఎంతో గొప్పగా అనిపించింది అంటూ తెలిపాడు.

అలాగే శివకార్తికేయన్ ఇటీవల ఒక ఫంక్షన్ లో కన్నీళ్లు పెట్టుకోవడం బాధగా అనిపించింది అని అందుకే ఎప్పుడైనా తనకు, తన సినిమాకు నా వంతు వీలైనంత సహాయం చేయాలని ఎదురు చూస్తున్న సమయంలోనే అనుకోకుండా ప్రిన్స్ ఈవెంట్ కు నాకు అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పానని చెప్పుకొచ్చాడు.ప్రిన్స్ టీమ్ మొత్తానికి ముందుగానే అభినందనలు తెలుపుతున్నట్టు తెలిపాడు రౌడీ స్టార్.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఇక పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఈ సినిమాను సునీల్ నారంగ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇందులో బ్రిటీష్ భామ మరియా ర్యాబోష హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు