తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
విజయ్ దేవరకొండకు యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
మరి ముఖ్యంగా అమ్మాయిల ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు.మొదట పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకున్నాడు.
కాగా విజయ్ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నాడు.ఇక అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ గా మారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇటీవలే విజయ్ దేవరకొండ లైగర్( Liger ) సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది.భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా భారీగా సాధిస్తుంది అని మూవీ మేకర్స్ అలాగే అభిమానులు అనుకున్నారు.
కానీ ఈ చిత్రం నిర్మాతలకు బోలెడు నష్టాన్ని మిగిల్చింది.ఇక లైగర్ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చార్మిలపై ఏ రేంజ్ లో ట్రోలింగ్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే.
లైగర్ మూవీ తర్వాత విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ఖుషి( Khushi ).ఇందులో స్టార్ హీరోయిన్ సమంత ( Samantha )హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఖుషి సినిమా పూర్తి అవడంతో పాటు సినిమా విడుదలకు ఇంకా నెల సమయం ఉండడంతో విజయ్ దేవరకొండ మరో పాన్ ఇండియా మూవీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
పరశురాం ( Parasuram )డైరెక్షన్‌లో కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం విజయ్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.ఇవన్నీ కూడా దేనికవే డిఫరెంట్ జోనర్ చిత్రాలు.
ఇక పరశురాం డైరెక్షన్‌లో కమిటైన చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు( producer Dil Raju ) నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగానే ఇప్పుడు విజయ్‌తో కొత్తగా పాన్-ఇండియన్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు.
ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించనున్నట్లు టాక్.జటాయు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా.
లీడ్ యాక్టర్స్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట మూవీ మేకర్స్.ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
జటాయు చిత్రంలో VFX వర్క్‌కు భారీ స్కోప్ ఉండటంతో ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy