అంత బిజీ హీరో సినిమాను మనం చూడటం అవసరమా?

తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ హీరో గా నటించిన బీస్ట్ సినిమా ను ఈనెల 13వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా దక్కించుకుంటుంది అంటూ తమిళ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈమద్య కాలంలో తమిళం సూపర్‌ స్టార్‌ విజయ్‌ సినిమా లకు 100 నుండి 200 కోట్ల వసూళ్లు చాలా సులువు అవుతున్నాయి.ఇలాంటి సమయంలో విజయ్ సినిమా తెలుగు రాష్ట్రా ల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.

తెలుగు లో ఈయన నటించిన సినిమా లు విడుదల అవ్వడం అవి కాస్త బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం జరుగుతుంది.బీస్ట్ సినిమా ను తెలుగు లో దిల్‌ రాజు డబ్బింగ్‌ చేశాడు.

తెలుగు డైరెక్ట్ సినిమా ను విడుదల చేసినట్లుగానే బీస్ట్‌ సినిమా ను ఆయన రిలీజ్ చేసేందుకు సిద్దం అయ్యాడు.తెలుగు లో సినిమా ల ప్రమోషన్‌ కార్యక్రమాలను ఆయన చేస్తున్నాడు.

Advertisement

తాజాగా పూజా హెగ్డే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం లో పాల్గొంది.ఆమె తో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్ కూడా పాల్గొన్నాడు.

కాని ఇప్పటి వరకు విజయ్ మాత్రం తెలుగు సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌ వచ్చేందుకు నో అంటున్నాడు.ఇక్కడ సినిమా షూటింగ్‌ కోసం రెగ్యులర్ గా వచ్చే విజయ్‌ ప్రమోషన్‌ కు వచ్చేందుకు మాత్రం బిజీ గా ఉన్నాడు.

తెలుగు ప్రేక్షకులు అంటే చులకన భావంతో చూసే ఆయన సినిమా లను మనం ఎందుకు చూడాలి అంటూ కొందరు తెలుగు ప్రేక్షకులు పేచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తానికి విజయ్ సినిమా ప్రమోషన్ కు రాకుండానే ఇక్కడ సక్సెస్‌ కోరుకుంటున్నాడు.

నువ్వు ఇక్కడకు రాకుండా అవమాన పర్చితే మేము ఎందుకు నీ సినిమా చూస్తాం అంటూ తెలుగు ప్రేక్షకులు విజయ్‌ కి కౌంటర్ ఇస్తున్నారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు