తమిళ హీరో విజయ్ ఆంటోనీ(Vijay Antony) ఎట్టకేలకు బిచ్చగాడు 2(Bichagadu 2) సినిమా ద్వారా మరోసారి మంచి సక్సెస్ అందుకున్నారు.
బిచ్చగాడు సినిమాకు సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా భారీగా కలెక్షన్లను రాబడుతుంది.
ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే మంచి కలెక్షన్లను రాబట్టడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.బిచ్చగాడు సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే సీక్వెల్ చిత్రం మాత్రం సిస్టర్ సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని ఎంతో కష్టపడి పని చేశారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా డైరెక్టర్ గా నిర్మాతగా అన్ని తానే ఈ సినిమా బరువు బాధ్యతలను భుజాలపై వేసుకొని సినిమాని ముందుకు నడిపిస్తూ వచ్చారు.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలోనే ఫలితాలను సాధించడంతో విజయ్ ఆంటోనీ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈయన సక్సెస్ మీట్ (Success Meet) కార్యక్రమాన్ని తిరుపతిలో జరుపుకున్నారు.ఈ క్రమంలోనే తిరుపతి (Trirupathi)లోని కపిల తీర్థం వద్ద ఉన్నటువంటి యాచకుల పట్ల ఈయన గొప్ప మనసు చాటుకున్నారు.
ఈ క్రమంలోనే విజయ్ ఆంటోని యాచకుల కోసం యాంటీ బికిలీ’ పేరిట కిట్లను హీరో అందజేశారు.దుప్పటి, చెప్పులు, అద్దం, సబ్బు, నూనె బాటిల్, దువ్వెన, విసనకర్ర ఉన్న కిట్స్ను యాచకులకు అందజేశారు.ఇలా కొంత సమయం పాటు అక్కడ యాచకులతో మాట్లాడిన అనంతరం ఈయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు.
ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అవ్వడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలియజేశారు.ఈ సినిమా తప్పకుండా 50 రోజులు ఆడుతుందని అర్థ శత దినోత్సవ వేడుకలకు తిరిగి తాను తిరుపతి వస్తానని తెలియజేశారు.
ఇక బిచ్చగాడు 3(Bichagadu 3) గురించి కూడా మాట్లాడుతూ ఇంకా ఈ సినిమా స్టోరీ లైన్ ఏమీ అనుకోలేదని మరో రెండు నెలలలో ఈ సినిమా గురించి పూర్తి వివరాలు తెలియజేస్తానని విజయ్ ఆంటోని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy