వీడియో: నిప్పుల గుండంలో వ్యక్తిని విసిరేద్దాం అనుకున్నారు కానీ చివరికి షాక్...

మతపరమైన కారణాలవల్ల ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కొందరు నిప్పుల కొలిమిలో నడవడం లేదంటే దూకడం చేస్తుంటారు.నిప్పులలో దూకితే ఆత్మశుద్ధి అవుతుందని చాలామంది నమ్ముతారు.

ధైర్యాన్ని, బలాన్ని నిరూపించుకోవడానికి కూడా కొందరు నిప్పుల గుండాల్లోకి దూకే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.నిప్పులలోకి దూకితే చర్మ వ్యాధులు ( Skin diseases )కూడా నయమవుతాయని కొందరు నమ్ముతారు.

ఎన్ని చెప్పినా సరే నిప్పుల వల్ల చర్మం కాలిపోయి ఆ నొప్పి అనుభవించడానికి నరకంలా ఉంటుంది.ఆ నరకాన్ని ఇద్దరు వ్యక్తులు అనుకోకుండా అనుభవించారు.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Video They Thought To Throw The Man In The Fire But In The End The Shock, Viral
Advertisement
Video They Thought To Throw The Man In The Fire But In The End The Shock, Viral

వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ముస్లిం వ్యక్తులు( Muslim people ) లాగా కనిపించే ముగ్గురు నిప్పుల కొలిమి ముందు నిల్చుకొని ఉండటం చూడవచ్చు.ఒక వ్యక్తి అందులోకి దూకడానికి రెడీ అవుతున్నాడు.అతడిని ఎత్తి నిప్పుల కొలిమిలో వేద్దామని అతని పక్కనే ఉన్న ఇద్దరు అనుకున్నారు కానీ ఫోర్స్‌ఫుల్‌గా అతడిని విసిరేద్దాం అనుకునే లోపు వారే అందులో పడిపోయారు.

ముగ్గురు కూడా బోర్లబొక్కలా నిప్పుల కొలిమిలో పడ్డారు.ఇది చూసి అక్కడ ఉన్న మిగతావారు షాక్ అయ్యారు.వారిని లేపడానికి ఉరుకులు పరుగులు తీశారు.

వారిని చాలా జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చారు.కానీ వారికి అప్పటికే తీవ్రమైన గాయాలైనట్లు తెలుస్తోంది.

Video They Thought To Throw The Man In The Fire But In The End The Shock, Viral

ఈ వీడియో చూసేందుకే చాలా భయానకంగా ఉంది.ఆకటనలో బాధితులైన వారికి ఇంకెంత భయమేసిందో, ఎంత బాధను అనుభవించారో ఊహించుకోవచ్చు.ఈ వీడియోను @ 1000 వేస్ టు డై అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది దీనికి ఇప్పటికే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

ఇది చూసి "అసలు ఇలాంటి పని ఎందుకు చేశారు? ప్రజలు ఇంకా మూర్ఖత్వాన్ని వీడడం లేదు." అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

దీనిని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు