అర్ధరాత్రి రోడ్డుపై జబర్దస్త్ రీతూ చౌదరితో రచ్చ చేస్తున్న అమర్ దీప్ వీడియో వైరల్!

బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు అమర్ దీప్ (Amar Deep) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బుల్లితెర నటుడిగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న అమర్ పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.

అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.తాజాగా ఈయన అర్ధరాత్రి రోడ్లపై జబర్దస్త్ నటి రీతూచౌదరితో(Ritu Chowdary) చేసిన రచ్చ మామూలుగా లేదు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమర్ దీప్ కి వీలు దొరికినప్పుడల్లా రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం మనం చూస్తూ ఉన్నాము.అయితే తాజాగా జబర్దస్త్ నటి రీతు చౌదరితో కలిసి ఈయన అర్ధరాత్రి రోడ్లపై పెద్ద ఎత్తున సందడి చేశారు.అమర్ దీప్ బాద్ షా( Amardeep Bad Shah ) సినిమాలోని బ్రహ్మనందం రీల్ చేసి కడుపుబ్బా నవ్వించాడు.

రీతూ దసరా మూవీలోని కీర్తి సురేష్ చేసిన బరాత్ డ్యాన్స్ చేసి అలరించింది.వీరిద్దరు కలిసి ఓ తమిళ్ సాంగ్ కు డ్యాన్స్ వేశారు.ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ అమర్ దీప్ యాక్టింగ్ సూపర్ అంటూ కామెంట్లో చేస్తున్నారు అయితే ఈ వీడియోలో మరి కొంతమంది బుల్లితెర నటులు కూడా కనిపించి సందడి చేశారు.

Advertisement

ఇలా వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడంతో ఇద్దరు కలిసి ఏదైనా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా అందుకే ఇలా ఇద్దరూ కలిసి రీల్స్ చేస్తున్నారా అంటూ పలు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక అమర్ దీప్ బుల్లితెర నటి తేజస్విని గౌడను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?
Advertisement

తాజా వార్తలు