తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గం రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ నేత వీ.హనుమంతరావు స్పందించారు.
తాము ఎవరినీ రాజీనామాలు చేయమని అడగలేదని చెప్పారు.నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు పీసీసీలో అవకాశం రాలేదని తెలిపారు.
పార్టీ హైకమాండ్ ఇరు వర్గాల మాట వింటుందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.మరోవైపు కాంగ్రెస్ సంక్షోభానికి తెర దించేందుకు పార్టీ అధిష్టానం దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ కాంగ్రెస్ అడ్వైజర్ గా బాధ్యతలను అప్పగించింది.