మిర్చి స్పూఫ్ చూసి ప్రభాస్ అలా అన్నారు.. ప్రభాస్ కు పండ్లు పంపా.. వేణుస్వామి ఏమన్నారంటే?

స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) అభిమానులు వేణుస్వామిని( Venu Swamy ) ఎంతలా ద్వేషిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఎప్పుడూ వేణుస్వామి చెబుతుండటంతో ప్రభాస్ ను వేణుస్వామి కావాలనే టార్గెట్ చేశారని చాలామంది భావిస్తారు.

అయితే వేణుస్వామి మాత్రం ప్రభాస్ పై తనకు వ్యక్తిగత ద్వేషం లేదని ప్రభాస్ కు తనకు మధ్య మంచి అనుబంధం ఉందని చెబుతుండటం గమనార్హం.తాను ప్రభాస్ ను టార్గెట్ చేయాలని ఎప్పుడూ భావించలేదని వేణుస్వామి వెల్లడించారు.

కొన్నిరోజుల క్రితం నా భార్యతో కలిసి మిర్చి స్పూఫ్( Mirchi Spoof ) చేశానని ఆ స్పూఫ్ వీడియో గురించి ప్రభాస్ స్పందిస్తూ నేను చాలా స్టైల్ గా ఉన్నానని అన్నారని ఆయన చెప్పుకొచ్చారు.మా తోటలో పండిన సీతాఫలాలు సైతం నేను ప్రభాస్ కు పంపించడం జరిగిందని వేణుస్వామి కామెంట్లు చేయడం గమనార్హం.

సీతాఫలం పండ్లు మళ్లీ ఉంటే పంపాలని ప్రభాస్ నన్ను కోరారని ఆయన చెప్పుకొచ్చారు.వేణుస్వామి చెప్పిన విషయాలు ప్రభాస్ కు వేణుస్వామికి మధ్య ఇంత అనుబంధం ఉందా అని కొంతమంది కామెంట్లు చేస్తుండగా క్రేజ్ కోసం వేణుస్వామి సెలబ్రిటీల పేర్లు వాడుకుంటున్నారని మరి కొందరు చెబుతున్నారు.తన సినిమాల ప్రమోషన్స్ కు హాజరు కాని ప్రభాస్ వేణుస్వామి గురించి పాజిటివ్ గా కామెంట్లు చేశారంటే ఎలా నమ్మాలని నెటిజన్లు చెబుతున్నారు.

Advertisement

వేణుస్వామి ఇండస్ట్రీలో తనకు తెలిసిన గాసిప్స్ ను జాతకలలా ప్రచారం చేస్తూ ప్రయోజనం పొందుతున్నారని నెటిజన్ల నుంచి క్రేజ్ పెంచుకుంటున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వేణుస్వామి ఫీజు 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తమని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.ఫ్రీగా పబ్లిసిటీ పొందడంలో వేణుస్వామి తర్వాతే ఎవరైనా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ కామెంట్లపై వేణుస్వామి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు