సోషల్ మీడియా వల్ల బర్రెలక్క శిరీష జీవితం నాశనం.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో( Social Media ) ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో బర్రెలక్క శిరీష( Barrelakka Sirisha ) ఒకరు.

కొల్హాపూర్ నుంచి పోటీ చేసిన శిరీష ఎన్నికల్లో గెలవాలని చాలామంది కోరుకున్నా ఆమెకు ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదు.

అయితే జ్యోతిష్కుడు వేణుస్వామి సోషల్ మీడియా వల్ల బర్రెలక్క శిరీష జీవితం నాశనం అయిందంటూ ఆసక్తికర విషయాలను చెప్పగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణుస్వామి ( Venu Swamy ) ఈ కామెంట్లు చేశారు.

సోషల్ మీడియా వల్ల బర్రెలక్కకు పాపులారిటీ వచ్చిందని ఆమె ఏదో ఆమె పని ఆమె చేసుకునేదని తీసుకొచ్చి అనవసరంగా ఆమె దగ్గర ఉన్న రూపాయి కూడా పోయేలా చేశారని వేణుస్వామి వెల్లడించారు.సోషల్ మీడియాలో హడావిడి చేయడంతో జనాలంతా పోయి ఆమెతో మాట్లాడారని వేణుస్వామి అన్నారు.

చివరకు ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని ఇప్పుడు ఆమె ముఖం చూసేవారు ఉండరని ఆయన వెల్లడించారు.అలా జరగకుండా ఉండి ఉంటే కాంగ్రెస్ పాలనలో( Congress ) బర్రెలక్కకు ఉద్యోగం వచ్చేదని వేణుస్వామి వెల్లడించారు.బీ.

Advertisement

ఆర్.ఎస్ కు( BRS ) ప్రచారం చేయడంతో అషురెడ్డికి( Ashu Reddy ) ఫోన్ చేసి బండ బూతులు తిట్టారని ఆమె ఎంతో బాధపడిందని వేణుస్వామి కామెంట్లు చేయడం గమనార్హం.

కలియుగంలో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి అన్నారు.రేవంత్ రెడ్డికి( Revanth Reddy ) శత్రువుల బెడద ఎక్కువగా ఉందని ఆయన కొన్ని పూజలు చేస్తే మంచిదని వేణుస్వామి కామెంట్లు చేశారు.వేణుస్వామి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో వేణుస్వామిపై కూడా ట్రోల్స్ వైరల్ అవుతుండటం గమనార్హం.చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) మళ్లీ అరెస్ట్ అయితే టీడీపీకి ఇబ్బందేనని ఆయన కామెంట్లు చేశారు.

చంద్రబాబు పవన్ పార్టీల పొత్తు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువని వేణుస్వామి పేర్కొన్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు