విజయ్ దేవరకొండ లైగర్ ఆగస్టు 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి సహనిర్మాతలుగా ఉన్నారు.
రమ్యకృష్ణ మరొక ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించగా, ప్రస్తుతానికి ఈ సినిమా మొదటి షో పూర్తి అయిన తర్వాత మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది.సినిమా అనుకున్నంత బాగా లేదని, అసలు హీట్ అయ్యే దాఖలాలు కూడా కనిపించడం లేదని సోషల్ మీడియాలో నెగిటివ్ పబ్లిసిటీ మొదలైంది.
మరి సినిమా ఫలితం తెలియాలంటే మరో రెండు లేదా మూడు రోజులు ఆగితే కానీ తెలిసే పరిస్థితి లేదు.
ఇక ఈ సినిమా సంగతి పక్కన పెడితే విజయ్ దేవరకొండ జాతకంలోనే అష్టమదశ శని నడుస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ మరొక ఉదయ్ కిరణ్ అయినా కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదనేది వేణు స్వామి వాదన.గతంలో అరవింద్ స్వామి, అబ్బాస్, ఉదయ్ కిరణ్, కునాల్ వంటి స్టార్ హీరోలు ఎలా అయితే ఒక్కసారిగా విపరీతమైన స్టార్ డం చూసి డీలపడ్డారో అలాగే విజయ్ దేవరకొండ సైతం తన జాతకంలో ఉన్న అష్టమదశ శని ప్రభావంతో అలాగే విజయాల నుంచి అపజయాల బాట పడతాడని వేణు స్వామి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి పరాజయాలు తప్ప విజయాలను చూడని విజయ్ దేవరకొండ మరోమారు లైగర్ పరాజయాన్ని మూట కట్టుకున్నట్టుగానే తెలుస్తోంది.మరి ఈ సినిమా ఫలితంతో వేణు స్వామి తన మాటలు నిజమయ్యాయని మరో మారు గట్టిగా చెబుతున్నాడు.ఏది ఏమైనా బాలీవుడ్ ని ఢీకొట్టాలని ప్రయత్నంతో మొదటిసారి పాన్ ఇండియా చిత్రంగా విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా బాధాకరమే.మరి ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తన సినిమాల పంథా మార్చుతాడా లేదా అనేది వేచి చూడాలి.







