శ్రీనివాస కళ్యాణంకు పెద్దొడి, చిన్నోడి అక్షింతలు

నితిన్‌, రాశిఖన్నా జంటగా దిల్‌రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘శతమానంభవతి’ చిత్రంతో భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్న సతీష్‌ వేగేశ్న ఈ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో అవార్డును దక్కించుకున్న దర్శకుడు అదే నేపథ్యంలో మరో చిత్రాన్ని చేయడం జరిగింది.

వివాహం కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్‌ మరియు ట్రైలర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి.ఈ చిత్రం ఖచ్చితంగా మంచి విజయాన్ని దక్కించుకుంటుందనే ఉద్దేశ్యంతో అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.

నితిన్‌ మరియు రాశిఖన్నాల మద్య రొమాన్స్‌ అద్బుతంగా వచ్చిందని, నిజంగా వీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేది అన్నట్లుగా సీన్స్‌ వచ్చాయంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.తాజాగా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం జరిగింది.

Advertisement

వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌తో సినిమా ప్రారంభం కాబోతుంది.

దిల్‌రాజు బ్యానర్‌లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటించిన మహేష్‌బాబు మరియు వెంకటేష్‌ు ఈ చిత్రంకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చేందుకు ముందుకు రావడంతో చిత్రం స్థాయి అమాంతం పెరిగింది.ట్రైలర్‌కు మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వగా తాజాగ సినిమా ఆరంభంలో వెంకటేష్‌ వాయిస్‌ ఉండబోతుంది అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు స్వయంగా ప్రకటించారు.శ్రీనివాస కళ్యాణం చిత్రంకు వీరిద్దరి వాయిస్‌ ఓవర్‌, పెళ్లికి ఇద్దరు ప్రముఖు అక్షింతలు అన్నట్లుగా ఉంటుందని, నూతన వధువరులకు ప్రముఖుల ఆశీర్వాదం దక్కినట్లుగా ఉంటుందని, తప్పకుండా ఆ ఆశీర్వాదం అద్బుతమైన సినిమాకు కలిసి వస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.

రికార్డు స్థాయిలో విడుదల కాబోతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రంతో నితిన్‌ కెరీర్‌ బెస్ట్‌ కలెక్షన్స్‌ను రాబట్టనున్నాడనిపిస్తుంది.సినిమాకు పెద్దొడు, చిన్నోడి వాయిస్‌ ఓవర్‌లు ఏ మేరకు ఉపయోగం అవుతాయి, దిల్‌రాజుకు ఈ చిత్రం మరో జాతీయ అవార్డును తీసుకు వస్తుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.

రోజుకు ఐదు నిమిషాలు గోడకుర్చీ వేయడం వల్ల ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా?
Advertisement