ఎఫ్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా.. అన్ని కోట్లు వచ్చాయా!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా ఎఫ్ 3.

ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను స్టార్ట్ చేసాడు.ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Advertisement
Venkatesh Varuntej F3 Box Office Collection Day 1 Details, F3 Movie, Day 1 Colle

దీంతో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి.మరి ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్స్ రాబట్టిందో తెలుసుకుందాం.ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10.37 కోట్ల షేర్ రాబట్టింది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు.ఇక ఓవర్సీస్ లో కూడా హాఫ్ మిలియన్ వసూలు చేసిందట.

ఈ సినిమాలో కథ లేకపోయినా ప్రేక్షకులు మెచ్చే వినోదం ఉండడంతో కావలిసినంత ఫన్ కోసం ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు.

Venkatesh Varuntej F3 Box Office Collection Day 1 Details, F3 Movie, Day 1 Colle

వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, సునీల్ కామెడీ కూడా బాగా పండింది.అందులోను చాలా రోజుల తర్వాత కుటుంబం మొత్తం ఒకదగ్గర చూడగలిగే సినిమా కావడం కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యింది.ఈ సినిమా వీకెండ్ ముగిసే సమయానికి మంచి కలెక్షన్స్ సాధిస్తుంది అంచనా వేస్తున్నారు.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది అంటే.నైజాం - 4.06 కోట్లు,ఉత్తర ఆంధ్ర - 1.18 కోట్లు,నెల్లూరు - 62 లక్షలు, గుంటూరు - 88 లక్షలు, వెస్ట్ - 94 లక్షలు, ఈస్ట్ - 76 లక్షలు, కృష్ణ - 67 లక్షలు, సీడెడ్ - 1.26 కోట్లు,మొత్తం షేర్ - 10.37 కోట్లు రాబట్టింది.మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు